ప్రేక్షకులకి డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్దమైన కీర్తి

2018లో `మహానటి`గా నటించి ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డ్ సాదించిన మలబార్ బ్యూటీ కీర్తి సురేష్గత ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేడి. అలా గ్యాప్ తీసుకున్న ఆమె 2020లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఏడాది సుమారు నాలుగైదు సినిమాలు ఈ ఏడాదిలో ఆమెవి రిలీజ్ అవుతాయని అంచనా, అందునా ఒక్క మార్చి నెలలోనే రెండు సినిమాలతో ప్రేక్షకులకి డబుల్ ట్రీట్ ఇవ్వనుంది కీర్తి.
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా “మిస్ ఇండియా” మార్చి 6వ తేదీ రిలీజ్ కానుంది. . నూతన దర్శకుడు నరేంద్ర నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఇక మార్చి 26న ఏమో కేరళ బాహుబలిగా మలయాళీలు ప్రచారం చేసుకుంటున్న పాన్ – ఇండియా మూవీ `మరక్కర్ అరబిక్ కడలింటే సింహం` విడుదల కానుంది. అంటే.. మూడు వారాల గ్యాప్ లో కీర్తి డబుల్ ట్రీట్ ఇవ్వనుందన్నమాట.