మహేష్ ని ఏ చెప్పుతో కొట్టాలి...పునర్నవి సంచలనం

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతోంది. షో ముగియడానికి ఇంకా నాలుగు వారాల సమయమే మిగిలి ఉండడం వలన ఈ సీజన్ విన్నర్ గా ఎవరు నిలుస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ‘బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్’ పేరుతో కంటెస్టెంట్లను ఆడించిన బిగ్ బాస్ నిన్న ఆ మెడాలియన్ ఎవరు గెలిచారు అనేది నాగార్జున ప్రకటించారు. శుక్రవారం హౌస్‌లో ఏం జరిగిందో మన టీవీ ద్వారా ప్రేక్షకులకు చూపించారు నాగార్జున. బాబా భాస్కర్‌తో అలీ రెజా వర్కౌట్స్ చేయించాడు.
ఒక్కరోజులోనే వర్కౌట్స్ చేసేసి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్ అయిపోదామనుకుంటున్నావా అంటూ , బాబా భాస్కర్‌పై శ్రీముఖి సెటైర్లు వేసింది. ఆ తరవాత అలీ రెజా శివజ్యోతిని భుజాన ఎత్తుకుని వచ్చి, ఆమెను భుజాలపై ఎత్తుకొనే వర్కౌట్స్ చేశాడు. నవరాత్రులు కదా నేను గుడ్డు కూడా తినను అని మహేష్ చెప్పి ఆమ్లెట్ వేసుకుని తినేశాడు. ఆ సమయంలో పునర్నవి అడిగితే తెలియక తినేశానని చెప్పాడు. ఈ విషయాన్ని వరుణ్, వితిక దగ్గర డిస్కస్ చేసిన పునర్నవి ‘‘వాడు ఆమ్లెట్ తిని ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు నవరాత్రులు నేను తిన్ను అంటున్నాడు.
ఏ చెప్పుతో కొట్టాలో అర్థంకావడంలేదు’’ అని పునర్నవి అనడంతో వరుణ్, వితిక పకపక నవ్వారు. రాహుల్, పునర్నవి మధ్య అలగడం శనివారం ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. పునర్నవి మాట్లాడదామని వెళితే రాహుల్ తన ముందు నుంచి వెళ్లిపొమ్మని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఏమైందో ఏమీ కానీ, రాహుల్ ఒక్కడూ స్మోకింగ్ రూంలో కూర్చొని ఏడుస్తున్నాడు.
ఆ సమయంలో బాబా భాస్కర్ అక్కడికి వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో అమ్మానాన్న గుర్తొచ్చారని రాహుల్ చెప్పాడు. ఇక బాబా భాస్కర్‌ను రిక్షాలో నుంచి నెట్టేసి ‘బ్యాటిల్ ఆఫ్ ది మెడాలియన్’ విజేతగా నిలిచిన వితికకు నాగార్జున పంచ్‌లు విసిరారు. బాబా భాస్కర్‌ను తోసేసి ఏం గేమ్ ఆడావు వితిక అంటూ నవ్వుతూ సెటైర్ వేశారు. కానీ, వితిక మాత్రం తనను సమర్థించుకుంది. ఒక అమ్మాయిగా నేను ఆ సమయంలో అలా తప్ప ఇంకేం చేయలేనని వితిక క్లారిటీ ఇచ్చింది. బాబా భాస్కర్లా తాను కెమెరాల ముందు అలా చేయలేనని, అందుకే గెలవడం కోసం ఆయన్ని తోసేశానని వితిక చెప్పింది. తనని తాను సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. ఇక ఈవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయినవారిలో రాహుల్, మహేష్, పునర్నవి, వరుణ్ సందేశ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో రాహుల్ సేఫ్ అయినట్టు ఎపిసోడ్ చివరిలో నాగార్జున ప్రకటించారు. ఇక ఈరోజు మహేష్, పునర్నవి, వరుణ్‌లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలనుంది. వీరిలో ఒకరిని వితిక సేవ్ చేసే అవకాశం ఉండడంతో ఆమె పునర్నవిని సేవ చేయచ్చని అనుకుంటున్నారు.