బాలకృష్ణ రహస్య పూజలు...అందుకేనా ?

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ ఈరోజు ఏపీలోని అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు లో ప్రత్యేక పూజలు నిర్వహించారని సమాచారం. శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞతో కలిసి దేవుడికి ప్రత్యేక పూజలు చేయించారని చెబుతున్నారు. ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో చండీ హోమం,సుదర్శన హోమం, రామలింగేశ్వరస్వామి రుద్రాభిషేకంను స్వయంగా బాలకృష్ణ, మోక్షజ్ఞలు నిర్వహించారని చెబుతున్నారు. పుల్లేటికుర్రుకు చెందిన బాలకృష్ణ గురువయిన మల్లేశ్వరరావు సిద్దాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారని సమాచారం. బాలకృష్ణ పర్యటన అత్యంత గోప్యంగా ఉంచడానికి ఉదయం నుండి పోలీసులు ప్రత్యేకంగా నాకా బందీ నిర్వహించి అటు ఆలయంలోనికి కానీ ఇటు నాగమల్లేశ్వరరావు సిద్ధాంతి ఇంటి ఆవరణ వద్దకు కానీ కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. అయితే కార్యక్రమం ముగించుకుని వెళుతున్న సమయంలో లో బాలకృష్ణ, అతని కుమారుడు మోక్షజ్ఞలు మీడియా కంట పడడంతో కెమెరాలు క్లిక్ మనిపించాయి. అయితే ఈ విషయం మీద ఆయనను పలకరించినా సమాధానమివ్వకుండా వెళ్ళిపోయారు. అయితే ఈపూజలు మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం కోసమే అని అంటున్నారు. ఈ విషయం మీద మరింత క్లారిటీ రావాల్సి ఉంది.