సమంతా బర్త్ డే...స్వయంగా కేక్ తయారు చేసిన చైతూ

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ ఎవరంటే అందరికి టక్కున గుర్తొచ్చేది చైతూ, సమంతలే. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత వివాహం చేసుకున్న ఈ జంట ఈ నాటికీ అదే ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రల జోలికి పోకుండా, నటనకు ఆస్కారమున్న పాత్రలను ధరిస్తూ, లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుని వెళుతోంది సమంతా. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం సమంత, ఆమె భర్త నాగ చైతన్యలు ఇంటికే పరిమితం కాగా, పుట్టిన రోజు వేడుకలు సైతం నిరాడంబరంగా సాగాయి. తన భార్య కోసం స్వయంగా చైతూ వంటగదిలోకి వెళ్లి గరిట పట్టాడు. బర్త్ డే కేక్ ను తయారు చేశాడట. ఆపై సమంత దాన్ని కట్ చేసి, భర్తకు తినిపించింది. ఈ మొత్తాన్ని వారు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమంత బర్త్డే సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మరో పక్క ఆమెకు సెలబ్రిటీలు కూడా విషెస్ అందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఓ బేబీతో బ్రేక్ తీసుకున్న ఆమె అమెజాన్ ప్రైమ్ లో రావాల్సి ఉన్న 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. దీనితో పాటు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా ఆమె చేయాల్సి ఉంది.