కోడలితో గొడవ...అనారోగ్యం...అన్ని పుకార్లకీ క్లారిటీ ఇచ్చిన నాగ్

కింగ్ నాగార్జునకు అనారోగ్యం...మామకూ కోడలికి చెడిందని ఇలా నాగార్జున ఫ్యామిలీ గురించి రకరకాల ప్రచారం సాగింది. అయితే వీటన్నిటికీ తన పుట్టిన రోజు సెలేబ్రేషన్స్ తో క్లారిటీ ఇచ్చేశాడు నాగ్. టాలీవుడ్ మన్మథుడు, అభిమానుల కింగ్ అక్కినేని నాగార్జున ఆగస్టు 29న 60వ ఏట అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాదీ అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకను జరుపుకునే నాగ్ ఈ సారి మాత్రం కోడలి ప్లానింగ్ ప్రకారం స్పెయిన్లో బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలు అన్నిటినీ సమంతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. "మీ ప్రేమకి ధన్యవాదాలు. ఎప్పటికి మీ ప్రేమ, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను" అని నాగ్ మామయ్య చెప్పమన్నాడంటూ సోషల్ మీడియాలో పేర్కొంది సమంత. దీంతో వీరి మధ్య గొడవలు అయ్యాయని, మాట్లాడుకోవడం లేదని అంటూ సాగిన ప్రచారం, అలాగే మన్మధుడు 2 చిత్రం కోసం యంగ్ లుక్ కి మారాలనుకున్న నాగార్జున తీవ్రంగా కసరత్తులు చేసి కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడని బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అనుమానమేనని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సెలబ్రేషన్స్ తో అన్నిటికీ బ్రేక్ వేసేసారు. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో నాగార్జునతో పాటుగా అమల, సమంత, నాగచైతన్య, అఖిల్ ఉన్నారు. స్పెయిన్ లోనే వారం రోజులపాటు హాలీ డే ట్రిప్ని ఎంజాయ్ చేయనున్న వీరంతా సెప్టెంబర్ 6న ఇండియాకు తిరిగొస్తారని అంటున్నారు.