అమ్మో మోక్షజ్ఞ ఏందిది

వామ్మో ఏందిది అనుకోకండి నందమూరి మోక్షజ్ఞ కొత్త లుక్ ఇది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న లుక్ ఇది. ఈయన ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు. ఎందుకంటే ఈ వంశం నుంచి కొత్త హీరో వచ్చి ఒకటి రెండు కాదు 13 ఏళ్ళైపోయింది. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, బాలయ్య ఇండస్ట్రీలో తమ నందమూరి ఇంటి పేరు నిలబడుతున్నా వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. మరోవైపు మిగతా సినిమా కుటుంబాల నుంచి వారసులు ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. మెగా ఫ్యామిలీ అయితే తమ కుర్రాళ్లతో ఇండస్ట్రీని నింపేసింది. దాంతో ఇప్పుడు నందమూరి కుటుంబం మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. ఈ లోటు భర్తీ కావాలి అంటే ఇప్పుడు ఈ కుటుంబం నుంచి రావాల్సిన వారసుడు నందమూరి మోక్షజ్ఞ. ఇప్పటికే 21 ఏట అడుగు పెట్టాడు మోక్షజ్ఞ. తాజాగా మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ బయటకు వచ్చింది. ఈ లుక్ చూపిన నందమూరి అభిమానులు షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పిక్ ఈ మధ్యనే తీసినట్టుంది. ఈ పిక్ ప్రకారం అయితే హీరోగా నటించేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేడు మోక్షజ్ఞ. నిజానికి మోక్షజ్ఞకు సినిమాల్లో నటించే ఆసక్తి లేదన్న ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమాలకు తగ్గ ఫిజిక్ తో సిద్ధం కావటం లేదన్న టాక్ వినిపిస్తోంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్న మోక్షజ్ఞ సినిమాల విషయంలో ఇంకా నిర్ణయం ఏమీ తీసుకోలేదన్న ప్రచారం జరుగుతోంది. చూద్దాం ఏమవుతుందో ?