ఆయుర్వేదాన్ని నమ్ముకుంటున్న అందాల నయనతార..

అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే కేరళ ఆయుర్వేదాన్ని నమ్ముకుంటుంది నయనతార. దానికి కారణం ఆమె వయసు. వద్దన్నా పెరిగే వయసును ఆపడం ఎవరి వల్ల కాదు. ఆ వయసు తీసుకొచ్చే సమస్యలను కూడా దాచడం ఎవరి తరం కాదు. ఇప్పుడు నయనతార కూడా ఇదే తెలుసుకుని.. అందాలను కాపాడుకునే పనిలో బిజీ అయిపోయింది. వయసు 35 దాటేయడంతో ఇప్పటికే పెద్దరికం కనిపిస్తుంది. కుర్ర హీరోలతో కనిపించినపుడు నయన్ పెద్దరికం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక సీనియర్ హీరోలతో నటించినపుడు వయసు ఇట్టే కనబడుతుంది. ఈ మధ్యే సైరాలో కూడా ఇదే పరిస్థితి. చిరంజీవి 64 ఏళ్లకు అలా ఉంటే.. నయన్ మాత్రం ఆయన ముందు మరింత పెద్దగా కనిపించింది. దాంతో ఇప్పుడు తన గ్లామర్ కాపాడుకోడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
తాజాగా కేరళ ఆయుర్వేదాన్ని నమ్ముకుని మళ్లీ యవ్వనం సాధించాలని చూస్తుంది నయన్. ముఖ్యంగా డిసెంబర్ లో ప్రియుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నయనతార.. ఆ లోపు అతడికంటే లేతగా మారిపోవాలని చూస్తుంది. వయసులో విఘ్నేష్ కంటే ఏడాది పెద్దది నయనతార. ఇప్పటికే ఇద్దరూ ఉన్నపుడు ఆ తేడా కూడా కనిపిస్తుంది. అది కనబడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది నయన్. మరి ఈమె చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలిక.