సమంత కటౌట్‌పై సెటైర్లు.. జిమ్ కు పనికొస్తుందంటూ ట్వీట్స్..

మజిలీ సినిమా తర్వాత సమంత అక్కినేని నటించిన సినిమా ఓ బేబీ. ముందు నుంచి ఈ చిత్రంపై ఆసక్తి బాగానే ఉంది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈమె నటించిన రెండో సినిమా ఇది. సిద్ధార్థ్ హీరోగా ఆరేళ్ల కింద వచ్చిన జబర్దస్త్ తర్వాత మరోసారి ఈమెతో సినిమా చేసింది సమంత అక్కినేని. ఆ సినిమా డిజాస్టర్ అయినా కూడా కథపై ఉన్న నమ్మకంతో మరోసారి నందిని రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది స్యామ్. ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వస్తున్న ఓ బేబీ ప్రపంచ వ్యాప్తంగా జులై 5న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చింది. నిడివి కూడా భారీగానే ఉంది. ఏకంగా 2 గంటల 40 నిమిషాల నిడివితో ఓ బేబీ వస్తుంది. ఇది కాస్త ఎక్కువే కానీ కథ బాగుంది కాబట్టి సరిపోతుంది అంటున్నారు దర్శక నిర్మాతలు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించాడు.
ఇక ఈ సినిమా కోసం దేవీ 70 ఎంఎం థియేటర్ దగ్గర సమంతకు భారీ కటౌట్ ఏర్పాటు చేసారు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోకులు బాగానే పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ కటౌట్ ను తమ ఊళ్లో జిమ్ బిజినెస్ కోసం వాడుకోవచ్చా అంటూ ఓ ఫ్యాన్ సమంతను అడిగాడు. దీనికి స్యామ్ కూడా చాలా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. మీ కండలను గ్రాఫిక్స్‌లో కవర్ చేసి మా ఫ్రెండ్ జిమ్ అడ్వర్ టైజ్ మెంట్ చేసుకుంటాడు అంటూ ఆయన అడిగిన ప్రశ్నకు 'బేబీ ఆన్ స్టెరాయిడ్స్' అంటూ సంచలన సమాధానం చెప్పింది సమంత. మొత్తానికి యు టర్న్ సినిమాతో ప్రశంసలు మాత్రమే అందుకున్న సమంత.. ఈ సారి కమర్షియల్ విజయం కూడా అందుకోవాలని చూస్తుంది. మరి ఆమె ఆశలను ఓ బేబీ ఎంత వరకు నెరవేరుస్తుందో చూడాలి.