హాట్ టాపిక్ గా మారిన నిత్యా మీనన్ లెస్బియన్ కిస్

ఈ మధ్య కాలంలో నటించడం తెలిసిన చాలా కొద్ది మంది హీరోయిన్ లలో నిత్యా మీనన్ ఒకరు. మళయాళీ భామ అయిన కూడా తాను ఏ భాషలో సినిమా చేస్తే ఆ భాష నేర్చుకొని తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం నిత్యా గొప్పతనమనే చెప్పాలి. అభినవ సౌందర్య అనిపించుకునే ఈమె నటన పరంగా కాక ఎంత సేపూ ఎక్స్ పోజింగ్ మీద దృష్టి పెడుతున్న హీరోయిన్ లు ఉన్న ఈ రోజుల్లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే నిత్య మీద మొదటి నుంచీ విపరీతమైన రూమర్లు నడుస్తున్నాయి. అందుకేనేమో ఆమెకు ఆఫర్లు డల్ అయ్యాయి. నిత్యామీనన్ నటించిన బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే హిందీ వెబ్ సిరీస్ రిలీజ అయింది. ఇందులో నటి నిత్యామీనన్ లెస్బియన్‌గా నటించింది. మరో యువతితో ఈమె నటించిన లిప్ లాక్ సన్నివేశాలు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటి దాకా కట్టు గీసుకుని మంచి పాత్రల్లోనే నటించిన నిత్య ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎలా అంగీకరించిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి మనకి ఇక్కడ లిప్ లాక్ లు కొత్త గానీ బాలీవుడ్లో సర్వసాధారణం. అయినా ఇక్కడి ఆమె అభిమానులు దానిని అంగీకరించడానికి రెడీగా లేరు మరి. నిజానికి గతంలోనే నిత్యామీనన్ ‘అ’ చిత్రంలో ఇలాంటి వివాదాస్పద లెస్పిబియన్ పాత్రలో నటించింది. కానీ అందులో అయితేఎక్కడా ముద్దు సన్నివేశాలు లేవు. ఇక ప్రస్తుతం నిత్య తమిళంలో జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న ‘ది ఐరన్ లేడీ’ అనే చిత్రంలో నటించడానికి సిద్దం అవుతోంది.