విరాటపర్వంలో నివేదా థామస్ కాదు.. నివేదా పేతురాజ్

దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న విరాట పర్వం చిత్రం ఫైనల్ స్టేజ్ కు పరుగులు తీస్తుంది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర కోసం నివేదా పేతురాజ్ని ఎంచుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. ఈ షెడ్యూల్ లోనే.. నివేదా సెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అభ్యుదయ భావాలు, నక్సలిజం.ప్రేమ వీటి మధ్య సాగే కథ ఇది. ఈ సినిమాలో ఈమె రోల్ అత్యంత కీలకంగా మారనుంది.. అలాగే ఈరోజు హైదరాబాద్ షూట్ లోనే ఆమె పాల్గొననుంది. ఇక ఈ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల ఒక సరికొత్త కంటెంట్ మరియు ఇంతకు ముందు ఎన్నడూ చూడని పాత్రలను డిజైన్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో రానా సరసన టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ వారు మరియు ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.