థియేటర్లలో ఒరేయ్ బుజ్జిగా..రిలీజ్ డేట్ ఇదే

2020-12-04 15:05:20
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా.. ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న థియేటర్లలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ``2021కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బేనర్లో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్టైనర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను జనవరి 1న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నాం`` అన్నారు.