కరోనా వైరస్ వైదొలిగిన రోజే అసలైన ఉగాది: పవన్ కళ్యాణ్

అభిమానులకు ప్రేక్షకులకు ప్రజలకు తనదైన శైలిలో ఉగాది శుభాకాంక్షలు తెలిపాడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈసారి ఉగాది జరుపుకుందాం.. అందరికీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ ప్రశ్నలు విడుదల చేశాడు పవర్ స్టార్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న యావత్ తెలుగు సోదర సోదరీమణులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు.. ప్రస్తుతం ప్రపంచం కరోనా వైరస్ కోరల్లో గజగజ వణికిపోతోంది.. ఈ మహమ్మారి మానవజాతిని కబళించడానికి పొంచి ఉంది.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వస్తున్న శార్వరి నామ ఉగాది సంవత్సరం అందరికీ మేలు చేయాలని.. ఈ వైరస్ బారి నుంచి అందరూ బయటపడాలని కోరుకుంటున్నట్లు తన తరఫున తన జనసైనికుల తరఫున పవన్ కళ్యాణ్ లేఖలో తెలిపారు. దయచేసి ఈ ఉగాది వేడుకలను ఇంటికే పరిమితం చేసుకుందాం.. కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే పండగ చేసుకుందాం.. ఈ మహమ్మారి అంతమైన రోజు అసలైన ఉగాది పండుగ ఆనందంగా జరుపుకుందాం అంటూ ప్రజలను కోరాడు జనసేనాని. ఈ ముప్పును పారద్రోలడానికి ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటిద్దాం అంటూ అభిమానులను కోరాడు పవన్ కళ్యాణ్.