పవన్ సినిమాని కన్ఫాం చేసిన తమన్...ఆరోజు నుండి షూట్ మొదలు...

అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ గా నిలిచిన అనంతరం ఏపీలో ఎన్నికలు రావడంతో పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయనని తేల్చేశారు. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం ఆయన మళ్ళీ మేకప్ వేసుకునేందుకు సిద్ధమైనట్టు ప్రచారం గట్టిగా జరుగుతోంది. హిందీ పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమాలు చేయనున్నాడని ఆ మధ్య వార్తలు రాగా వాటిని త్వరలోనే పవన్ నిజం చేయనున్నాడని అంటున్నారు. తాజాగా ఆ విషయాన్ని సంగీత దర్శ్జకుడు తమన్ ధ్రువీకరించాడు.
అల వైకుంఠపురములో సినిమా హిట్ కావడంతో బన్నీకి బోకే పంపిన పవన్ ఆయనతో పాటు తమన్ కి కూడా ఒక బొకే పంపాడు. తాను దైవంగా ఆరాధించే పవన్ కళ్యాణ్ తనపై ప్రశంసలు కురింపించే సరికి తమన్ ఉబ్బితబ్బిబైపోయాడు. నేను ఆరాధించే వ్యక్తి నుండి వచ్చిన ఈ అరుదైన బహుమతిని చూడగానే నా గుండె ఒక్కసారి కొట్టుకోవడం ఆగిపోయింది. ఇది మనం లీడర్, ఫ్యూచర్ పవర్ పవన్ కళ్యాణ్ వద్ద నుండి వచ్చింది.
అలాగే పవన్ తదుపరి సినిమాకు సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని, బెస్ట్ సంగీతాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న పింక్ రీమేక్ సినిమా జనవరి 20న సెట్స్ పైకి వెళ్ళనుందట. ఫిబ్రవరిలో పవన్ టీంతో జాయిన్ కానున్నాడని, కేవలం పది రోజులు మాత్రమే ఆయన ఈ సినిమాకి కాల్షీట్స్ ఇచ్చాడని అంటున్నారు.
ఇక మణిరత్నం నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కించే సినిమా కూడా పింక్ తో పాటే ప్యారలల్ గా షూటింగ్ జరుపుకుంటుందట. ఈ చిత్రానికి కూడా పవన్ 10 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రెండు సినిమాలకి కలుపుకొని దాదాపు వంద కోట్లకి పైగా రెమ్యునరేషన్ పవన్ అందుకోనున్నాడని విశ్వనయ వర్గాల సమాచారం.