నేను రెచ్చిపోవడానికి రెడీ కానీ కోట్లు కావాలంటున్న పూజా హెగ్డే..

ఇప్పుడు పూజా హెగ్డే ఇదే చేస్తుంది. తాను రెచ్చిపోవడానికి ఎంతగా అయినా సిద్ధమే అంటోంది. కావాలంటే బికినీ కూడా వేస్తారని బంపర్ ఆఫర్ ఇస్తుంది. అందాలు ఆరబోయడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది పూజ. అయినా ఒక్కసారి అందాలు ఆరబోసిన తర్వాత మళ్లీ మళ్లీ అదే చేసినా పెద్దగా సమస్య ఉండదు. ఇప్పుడు ఇదే చేస్తుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే మరో మాట లేకుండా పూజా పేరు చెబుతారు. ఎందుకంటే ఒక్క హిట్ కూడా లేకుండానే సూపర్ స్టార్స్ అందర్నీ చుట్టేసింది ఈ భామ. ఇప్పటికే మహేష్ బాబు, వరుణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ఇప్పుడు ప్రభాస్, అఖిల్ తో జోడీ కట్టింది. ఈమెకు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా ఇంకో హీరోయిన్ ను మాత్రం బతకనివ్వడం లేదు. పోటీ అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి కానీ ఒకరితో ఒకరు కంటికి కనబడని యుద్ధం చేస్తుంటారు.
పూజా హెగ్డే కూడా ఇదే చేస్తుంది. ఇన్ని సినిమాలు లైన్ లో ఉండగానే ఇప్పుడు మరోసారి హాట్ ఫోటోషూట్స్ తో నేనున్నానంటూ గుర్తు చేస్తుంది పూజా. అంటే మిగిలిన అవకాశాలు కూడా నాకే ఇవ్వండి.. ఇంక ఇక్కడ మరో హీరోయిన్ లేదు అని హింట్ ఇస్తుంది పూజా. డేట్స్ లేవు కానీ లేదంటే ఇంకా ఇద్దరు హీరోలు కూడా పూజానే కావాలంటున్నారు. తెలుగులో ఇంత బిజీగా ఉన్నా కూడా బాలీవుడ్ పై కూడా ఓ కన్నేసే ఉంచుతుంది పూజాహెగ్డే. అప్పట్లో ఈమె చేసిన ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ కూడా అందుకే. కొంగు చాటు అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఎంత చూపిస్తే అంత ఎక్కువ పారితోషికం కావాలని అడుగుతుంది పూజా హెగ్డే. దీనికి నిర్మాతలు కూడా సై అంటున్నారు.