English   

ఇతనితోనే.. పీకల్లోతు ప్రేమలో పూజ హెగ్డే

pooja
2020-01-19 18:38:35

సినీ ప్రియులకి హీరోయిన్ల ఎఫైర్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ మరోదానిపై ఉండదనే చెప్పాలి. ఏ హీరోయిన్ ఎవరితో ప్రేమలో ఉంది.. ఎవరితో డేటింగ్ చేస్తోంది.. అని ఆరా తీయడం వాళ్లకు స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఎవరితోనో ప్రేమాయాణం నడుపుతోందని గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో.. ఆ లక్కీ పర్సన్ ఎవరై ఉంటాడని చెవులు కొరుక్కున్నారు గాసిప్ రాయుళ్లు.

గతంలో హృతిక్ రోషన్ తో అమ్మడు లవ్ ట్రాక్ నడిపినట్టు వార్తలొచ్చాయి. అయితే తాజాగా పూజ బేబీ తాజా ప్రియుడు ఇతనేనంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అతను ఎవరో కాదు.. గత సంవత్సరం బాలీవుడ్ లో సైఫ్ అలీ ఖాన్ సినిమా 'బజార్' చిత్రంలో.. నటించిన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు 'రోహన్ మెహ్రా' నే అంటున్నారు. అతనితోనే అమ్మడు డేటింగ్ చేస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట. అయితే వీళ్లద్దరికి ఎక్కడ..? ఎలా..? కుదిరిందనే విషయం తెలియడం లేదంటున్నారు. మరీ.. రూమర్ పై పూజా ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇకపోతే.. రీసెంట్ గా 'అలా వైకుంఠపురంలో' సినిమాతో అలరించిన పూజాహెగ్డే.. వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'జిల్' ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జాన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే బొమ్మరిల్లు భాస్కర్-అఖిల్ కాంబినేషన్లో వస్తున్న అప్ కమింగ్ మూవీలోనూ నటిస్తోంది. అంతేకాదు మరోసారి హృతిక్ రోషన్ తో కలిసి జతకట్టబోతుందని టాక్ వినిపిస్తోంది.

More Related Stories