English   

వావ్ ఛార్మీ.. పూరీని నమ్ముకుని కొత్త కార్లు.. లగ్జరీ లైఫ్.. 

Puri Charmme Kaur
2019-09-17 16:08:57

హీరోయిన్లు నిర్మాతలుగా మారడం అరుదు. అవకాశాలు వచ్చినన్ని రోజులు సినిమాలు చేసుకుని ఆ తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతుంటారు. సంపాదించిన డబ్బులు దాచుకోవడమే కానీ.. తిరిగి మళ్లీ సినిమాలపై పెట్టడం అసలు మన హీరోయిన్లకు అలవాటు లేని పని. కానీ ఛార్మి అది చేస్తుంది. ఒకప్పుడు అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ అంటూ సినిమాలు నిర్మిస్తుంది. మొదట్లో వరస షాకులు తగిలినా కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ రుచి చూసింది ఈ భామ. దాంతో ఇప్పుడు ఈ చిత్రం తర్వాత వచ్చిన లాభాలతో కార్ కనేసింది. తనతో పాటు పూరీ కూడా కొత్త కార్ కొన్నాడు. ఈ కార్ కూడా పూరీనే కొనిచ్చాడు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారునే ఛార్మికి గిఫ్ట్ గా ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తనకు అంత మంచి కార్ గిఫ్టుగా ఇచ్చిన పూరీకి రేంజ్ రోవర్ వోగ్ కారును బహుమతిగా ఇచ్చింది ఛార్మి. మొత్తానికి ఈ కార్ల ఇచ్చి పుచ్చుకోవడం భలేగా అనిపిస్తుంది చూసిన వాళ్లకు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్నారు పూరీ, ఛార్మి. 
 

More Related Stories