రాక్షసుడు డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ గిఫ్ట్

బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ హీరోగా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకొన్నారు. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలు చాలా వరకు ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకొన్నవే. తొలిసారి ఇమేజ్ గురించి ఆలోచించకుండా ‘రాక్షసుడు’ సినిమా చేశారు. తమిళంలో విజయవంతమైన ‘రాచ్చసన్’కి తెలుగు రీమేక్ కాగా ఈ సినిమా ఆయన కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ "రాక్షసుడు" సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాక నిర్మాతకి కాసులు కూడా కురిపించింది. దీంతో ఈ సక్సెస్ ని పురస్కరించుకుని చిత్ర నిర్మాత కోనేరు సత్యనారాయణ దర్శకుడు రమేష్ వర్మకు ఓ అపురూపమైన గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ అంటే ఏ కారో ఫోనో అనుకునేరు కాదండోయ్ ఏకంగా జూబ్లీహిల్స్ లోని అయ్యన్న పెరల్ అనే భావన సముదాయంలో 3 కోట్ల విలువైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చారు. ఈ మధ్య కాలంలో నిర్మాతలు తాము వ్యాపారమే కాదు కాస్త మనసున్న వాళ్ళం అని కూడా చాటుకుంటున్నారు ఇలాంటి పనులు చేస్తూ.