రకుల్‌ను మరీ ఇంత హాట్‌గా ఎప్పుడైనా చూసారా..?

సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా ఫిజిక్ మెయింటనెన్స్‌లో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కు ఎప్పుడూ 100 మార్కులు వేయక తప్పదు. ఈమె తన ఫిజిక్ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటుంది. అందాలను కాపాడుకోవడంతో అందరి కంటే ముందుంటుంది రకుల్. ఈమె మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. టాలీవుడ్ లో ఉన్నంత కాలం అందాలు ఆరబోసింది కానీ ఎక్కడో ఓ చోట హద్దులు అయితే పెట్టుకుంది. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఆ బౌండరీ లైన్ కనబడటం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోతుంది. అడిగిందే ఆలస్యమన్నట్లు అందాలన్నీ మూటగట్టి కెమెరా ముందు పెట్టేస్తుంది. ఏమైందో తెలియదు నాకు అంటూ ఎంసిఏలో నాని పాడుకున్నట్లు రకుల్ కూడా ఇదే చేస్తుంది ఇప్పుడు.
ఉన్నట్లుండి ఈమె మనసు ఎటు కదులుతుందో ఎవరికీ క్లారిటీ లేదు. అంతగా సెగలు పుట్టించింది రకుల్. బాలీవుడ్ నీళ్ల మహిమో ఏమో కానీ ఇక్కడున్నపుడు సూక్తులు చెప్పే రకుల్.. అక్కడికి వెళ్లిన తర్వాత మాత్రం అవన్నీ తీసి పక్కనబెట్టేసింది. ఆ మధ్య మ్యాగ్జిమ్ ఫోటోషూట్ లో మ్యాగ్జిమమ్ అందాలన్నీ ఆరబోసింది ఈ బ్యూటీ. ఇక మొన్నటికి మొన్న ఫిట్ నెస్ పేరు చెప్పి మరోసారి అందాల ప్యాకెట్ ఓపెన్ చేసింది. బికినీకి తక్కువ కాని డ్రస్ లో అమ్మడు ఒలకబోసిన వయ్యారాలు చూసి చెమటలు పట్టడం ఖాయం. ఇప్పుడు కూడా బికినీ కాని బికినీలో అందాలన్నీ బయటపెట్టింది రకుల్. తన ఫిట్ నెస్ లెవల్స్ తో పాటు గ్లామర్ ను కూడా మరో లెవల్ కు తీసుకెళ్లిపోయింది. అందుకే ఏ మాత్రం మొహమాటం లేకుండా అందాలన్నీ తీసి కెమెరా ముందు పరిచేసింది రకుల్. ప్రస్తుతం తెలుగులో నితిన్, చంద్రశేఖర్ యేలేటి సినిమాలో నటిస్తుంది.