కలిసి నటించనున్న చిరంజీవి, చరణ్

చిరంజీవి మరోసారి రీమేక్‌నే నమ్ముకుంటున్నాడు. రీమేక్ మూవీ చేస్తున్నానని మెగాస్టార్ చెప్పకపోయినా సైరా ప్రమోషన్ సందర్భంగా అనుకోకుండా లీక్ అయిపోయింది. మలయాళంలో హిట్టయిన ఓ సినిమా తెలుగు రీమేక్ రైట్స్‌ను చరణ్ సొంతం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహ రెడ్డి' గాంధీ జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ 02న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో చిరంజీవి ఒక స్వాతంత్య్ర సమరయోధుడిగా కనిపించబోతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయం బయట పడింది. విషయం ఏమిటంటే చిరంజీవి ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. మళయాలంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసిఫర్ సినిమా హక్కులను చరణ్ కొన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా డైరెక్టర్ పృథ్వీ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వచించారు. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల్ని రామ్‌చరణ్ తన తండ్రి కోసమే కొన్నారని అంటున్నారు. మోహన్‌లాల్ పోషించిన పాత్రని చిరంజీవి, పృథ్వీరాజ్ చేసిన పాత్రని రామ్‌చరణ్ చేసే అవకాశాలున్నట్టు సమాచారం.
మరి ఈ చిత్రానికి కూడా పృథ్వీరాజే దర్శకత్వం వహిస్తారా లేక మరొకరికి ఆ బాధ్యతలు అప్పజెబుతారా అనేది చూడాలి. కొరటాల శివ, త్రివిక్రమ్ సినిమాల తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ పట్టాలెక్కే అవకాశముందని అంటున్నారు. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్, టోవినో థామస్ వంటి వారు నటించారు. తెలుగు సహా పలు బాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసింది. అయితే ఇది ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు చూసేసారు కాబట్టి ఏమి చేస్తారో చూడాలి.