ఇస్మార్ట్ శంకర్ ని కలిసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాల సక్సెస్ లతో జోరు మీదున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న సరిలేరు నీకెవ్వరు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పూరి టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ మీద పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. గత నెలలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా కలెక్షన్ల జోరు చూపిస్తుండడంతో ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ త్రీ హౌస్ లోకి వెళ్లి రచ్చ చేసి వచ్చారు ఇస్మార్ట్ శంకర్, నిధి అగర్వాల్ లు. ఇక సెట్ కూడా అన్నపూర్ణ లోనే ఉండడంతో ఈ ఇద్దరు హీరోలు ఒకరికొకరు ఎదురు పడ్డారు. అలా కలిసిన ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారట. ఇప్పుడు ఈ ఫొటో ఇంటెర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఫొటో.