బాపురే.. నడుము ఎక్కడ చేయించావు రాశీ ఖన్నా..

ఇప్పుడు రాశీ ఖన్నా ఇచ్చిన పోజు చూసిన తర్వాత ఇలా కాకుండా ఇంకెలా అంటాం చెప్పండి. అలా వయ్యారంగా చేతులు పైకెత్తి ఆ మధ్య ప్రదేశ్ ను అలా చూపిస్తుంటే కుర్రాళ్ల ఊపిరి ఆగిపోక మరేం చేస్తుంది. ఈ నడుమును చూడగానే సీతమ్మ వాకిట్లోలో మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. నడుమెక్కడ చేయించిందిరా బాబూ.. ఇంత సన్నగా ఉంది అని మహేష్ చెప్పిన మాటలే ఇప్పుడు రాశీకి సూట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. కొన్నేళ్ల పాటు మధ్యలో విజయాలు లేకపోయినా కూడా ఈ మధ్యే మళ్లీ వెంకీ మామ, ప్రతిరోజూ పండగే సినిమాలతో విజయాలు అందుకుంది. దాంతో ఇక్కడ మళ్లీ బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తర్వాత అమ్మడు తెలుగులో అరకొర అవకాశాలే వస్తున్నాయి. కానీ ఇప్పుడు విజయాలు కూడా రావడంతో మళ్లీ దూకుడు పెంచే పనిలో ఉంది రాశి. అందుకే అందాల ఆరబోత కూడా బాగానే చేస్తుంది. ఈ మధ్యే విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండతో హాట్ సీన్స్ కూడా చేసింది ఈ భామ. అయితే సినిమా డిజాస్టర్ కావడంతో అందమంతా అడవి కాచిన వెన్నెల అయిపోయింది. అందుకే తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టింది రాశీఖన్నా. రెండేళ్ల కింది వరకు తెలుగు తప్ప మరో భాషలో సినిమాలే చేయని రాశీఖన్నా.. ఇప్పుడు తమిళ, మలయాళ భాషలపై కూడా ఫోకస్ పెట్టింది. విలన్ సినిమాతో కేరళకు వెళ్లిన ఈ బ్యూటీ.. అక్కడ తొలి సినిమాతోనే షాక్ తినేసింది. దాంతో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసింది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరోలు అవకాశాలు ఇస్తారేమో అనుకుంటే అస్సలు వర్కవుట్ కావడం లేదు. అందుకే చిన్న హీరోలు.. వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకుంటుంది రాశీ ఖన్నా. అయితే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అని గిరి గీసుకుని కూర్చున్న రాశీఖన్నా.. ఇప్పుడు మాత్రం తెగిన గాలిపటంలా అన్ని ఇండస్ట్రీలు చుట్టేస్తుంది.