English   

బలుపు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ ?

raviteja
2019-05-27 22:36:49

మాస్ మ‌హారాజా ర‌వితేజకి ఈ మధ్య అసలు టైం ఏమీ బాలేదు. ఎన్ని సినిమాలు చేసినా ఏవీ కలిసి రావడం లేదు, హిట్ కొట్టడం లేదు. బెంగాల్ టైగ‌ర్ సినిమా ఫ్లాప్ కావడంతో త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజా ది గ్రేట్‌, ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాలు వ‌రుస‌గా చేశాడు. ఇందులో రాజా ది గ్రేట్ సినిమా ఒక్కటే మంచి హిట్ గా నిలిచింది. ఆయన ప్ర‌స్తుతం క్షణం ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌లో మొదలయ్యింది. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత రవితేజ మ‌రోసారి గోపి చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడట. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో డాన్ శీను, బ‌లుపు అనే చిత్రాలు వ‌చ్చాయి. అలాగే బలుపులో రవితేజతో కలిసి నటించిన శ్రుతి హాసన్ ఈ సినిమాలో కూడా నటించనుందని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆమె కూడా సినిమాలకి గ్యాప్ ఇచ్చింది, ఇక ఈ సినిమాతో ఆమె కూడా లైన్ లోకి రానుందన్నమాట. ఇక సెప్టెంబరు నెలలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌ సినిమా మొదలుకానున్నట్టు చెబుతున్నారు.

More Related Stories