ఆర్ఆర్ఆర్ లో అన్ని పాటలా

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక జక్కన్న తన సినిమాలను ఎంత భారీగా తీస్తాడో పాటలు కూడా అంతే రేంజ్ లో ఉంటాయి. లేటెస్ట్గా ఈ సినిమా గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 'ఆర్ఆర్ఆర్'లో మూడే పాటలు ఉన్నాయని గతంలో ప్రచారం జరగగా ఇప్పుడు ఈ సినిమాకి ఎనిమిది పాటలు పెడుతున్నారని ప్రచారం మొదలయ్యింది.
అయితే ఆ పాటలు దేశభక్తిని పెంచే పేట్రియాటిక్ సాంగ్స్ అని చెబుతుండగా, వాటితో పాటు హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్స్ కూడా ఉంటాయని కూడా అంటున్నారు. సుద్దాల అశోక్ తేజ స్వాతంత్య్ర ఉద్యమం మీద మూడు సాంగ్స్ రాస్తున్నారని చెబుతుండగా మరి కొందరు లిరిసిస్ట్స్ మిగతా పాటలు రాస్తున్నట్టు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు షూటింగ్ పూర్తి చేసి మూవీని జూలైలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది.