English   

యూరప్ వెళ్లనున్న సాహో 

 saaho
2019-04-29 19:23:57

బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో సాహో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. వారం రోజులుగా ముంబైలో షూటింగు జరుపుకుంటోంది. త్వరలోనే ఈ షెడ్యూల్ షూటింగు పూర్తవుతుందట. ఆ తరువాత ఈ సినిమా టీమ్ యూరప్ వెళ్లనున్నట్టు సమాచారం. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ల కాంబినేషన్‌ లో వచ్చే ఒక పాటను అక్కడి అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించనున్నారట‌. ఈ పాట సినిమాలో హైలైట్ గా నిలిచేలా చిత్రీకరించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను, ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసమే ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే బాహుబలి రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ తో వస్తున్న సినిమా కాబట్టి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఏమి చేస్తుందో మరి. ఈ సినిమాతో పాటే ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ జానర్ సినిమా తెరకెక్కుతోంది.

More Related Stories