సుకుమార్ రైటింగ్స్ లో సాయి ధరమ్ తేజ్ మూవీ ప్రారంభం

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా క్రిస్మస్ కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరోవైపు ఈరోజు తన కొత్త సినిమాను ప్రారంభించారు సుప్రీమ్ హీరో. తన శిష్యుల క్రియేటివిటీని ప్రోత్సహిస్తూ, వారిని దర్శకులుగా పరిచేయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ఇప్పుడు ఈ బ్యానర్లో సాయి తేజ్ కొత్త సినిమాను ప్రారంభించారు. సుకుమార్ దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీతో కలిసి సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం. కాగా, ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. దేవుళ్ల పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి చిత్ర కథానాయకుడు సుప్రీమ్ హీరో సాయి తేజ్ క్లాప్ నిచ్చారు. సుకుమార్ కుమార్తె సుకృతివేణి, కుమారుడు సుక్రాంత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ దర్శకుడు కార్తీక్ దండుకు స్క్రిప్ట్‌ను అందజేశారు. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.