మహేష్ సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ వచ్చేసింది

2020-08-09 09:27:52
మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది. మహేష్ బాబు - పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' మూవీ నుండి మోషన్ పోస్టర్ రీలీజైంది. ముందుగా చెప్పినట్టుగానే ఉదయం 9 గంటల 09 నిమిషాలకు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న కారణంగా సామూహిక వేడుకలు జరుపుకోవద్దని.. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తున్న యుద్ధంలో సురక్షితంగా ఉండడం అన్నింటికన్నా ముఖ్యమని.. నా పుట్టినరోజున అభిమానులంతా వేడుకలకి దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని మహేష్ బాబు కోరాడు.