ఎన్టీఆర్ ను కాదని షారుక్ తో...అందుకే

సౌత్ నుండి ఎందఱో దర్శకులు బాలీవుడ్ కి వెళ్లి మరీ అక్కడ సినిమాలు తీసి మెప్పించారు. ముఖ్యంగా తమిళ్ నుండి బాలచందర్, బాలు మహేంద్ర, శంకర్, మురుగదాస్, బాల ఇలా ఎందరో దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సినిమాలు చేస్తు ఫాంలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాకు కూడా ప్రభుదేవానే దర్శకుడు. ఈ సినిమా తరువాత సల్మాన్ తో రాధే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుల బాటలోనే అట్లీ కూడా నడవనున్నాడు. అట్లీ తమిళ్ లో రాజారాణి, తేరి, మెర్సల్, ఇప్పుడు బిగిల్ సినిమాలు చేశాడు.
ఈ నాలుగు సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. దీంతో అట్లీకి ఇప్పుడు కోలీవుడ్ నుంచి ప్రమోషన్ వచ్చింది. బాలీవుడ్ లో ఏకంగా షారుక్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం లభించింది. నవంబర్ 2 వ తేదీన ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంకీ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరవాత అట్లీతో ఓ సినిమా చేద్దామనుకున్నాడు. అట్లీ కూడా ఎన్టీఆర్ ని కలిసి ఓ కథ కూడా వినిపించాడు. అయితే ఆర్.ఆర్.ఆర్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో అట్లీ షారుక్ సినిమా ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.