షకలక శంకర్ మళ్లీ హీరో అయ్యాడు.. ఈ సారి కేడీ నెం 1..

షకలక శంకర్.. అప్పట్లో జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకుని కుమ్మేసాడు. మూడేళ్ల పాటు వరస స్కిట్లతో రప్ఫాడించాడు. కడుపులు చెక్కలయ్యేలా తన శ్రీకాకుళం యాసతో నవ్వించాడు. కొన్నేళ్లుగా జబర్దస్త్ మానేసిన శంకర్.. హీరోగా మారిపోయాడు. వరస సినిమాలు చేస్తున్నాడు. శంభో శంకర అంటూ తన పేరు మీదే ఓ సినిమా చేసాడు ఈ కమెడియన్. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ అభిమానిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. అభిమాని కాదు భక్తుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వారం కేడీ నెం 1 అంటూ వస్తున్నాడు ఈయన. ఈయన గత సినిమా శంభో శంకర కనీసం వచ్చినట్లు కూడా తెలియదు. అలాంటి సినిమాతో వచ్చాడు ఈ కమెడియన్. పాత కథనే తీసుకుని ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు శంకర్. ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైన కేడీ నెం 1 పరిస్థితి కూడా అంతే. ఈ సినిమా వస్తున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. కానీ జబర్దస్త్ క్రేజ్ ఉంది.. పవన్ అభిమానిగా గుర్తింపు ఉంది కాబట్టి ఏదో చేయడానికి వస్తున్నాడు శంకర్. ఆగస్ట్ 23న ఈ చిత్రం విడుదల కానుంది. కచ్చితంగా ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంటానని చెబుతున్నాడు కానీ అది అంత ఈజీ మాత్రం కాదని ఇట్టే అర్థమైపోతుంది.