English   

వరదలకు కొట్టుకుపోయిన శర్వానంద్ తాత ఇల్లు

 Sharwanand
2020-09-30 17:30:55

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా రెండు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఏపీలో కృష్ణానది పొంగి పొర్లుతుండటంతో పలు లంక గ్రామాలకు వరద నీరు పోటెత్తింది. ఈ వరదల కారణంగా సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా వరదల కారణంగా తీర ప్రాంతంలో ఉన్న శార్వానంద్ తాతయ్య ఇల్లు కొట్టుకుపోయింది. శర్వానంద్ తాత మైనేని హరిప్రసాద్ భారత్ అను శాస్త్రవేత్తగా పని చేశారు. కాగా ఆయన సొంత ఊరిపై అభిమానంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలోనే ఇల్లుని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటిలో ఎవరూ నివసించడంలేదు. ఇల్లు కూడా పూర్తిగా పాడయ్యింది. ఇక శర్వానంద్ ఏపీలో షూటింగ్ లు జరిగినప్పుడు ఆ ఇంట్లోనే బస చేసేవారు. ఇక ఇప్పుడు ఆ ఇల్లు కూలడం తో ఆయన షాక్ కు గురయ్యారు. మరోవైపు ఏపీలో వరదల కారణంగా ముంపు గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురుకొట్టున్నారు. దాంతో ప్రభుత్వం అలెర్ట్ ప్రకటించి సహాయక చర్యలను ప్రారంభించింది.

More Related Stories