బాలీవుడ్ లో వరుస ఆత్మహత్యలు ఖాయం..ఇదో పెద్ద మాఫియా

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్లో ఉన్నారని, ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజం అంశం హాట్ ఇష్యూగా మారింది. అయితే సుశాంత్ సూసైడ్ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా సూసైడ్ ల సిరీస్ మొదలవుతుందని వ్యాఖ్యానించాడు.
సంగీత ప్రపంచంలోను నెపోటిజం ఉందన్న ఆయన కేవలం రెండు కంపెనీలు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని చెప్పుకొచ్చాడు. ఎవరు పాడాలో, వద్దో ఆ రెండు కంపెనీలే నిర్ణయిస్తాయని ఆరోపించాడు. మ్యూజిక్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ కంటే పెద్ద మాఫియాలు ఉన్నాయని సోనూ వ్యాఖ్యానించాడు. "కొత్త సింగర్స్, లిరిక్స్ రైటర్స్ కంపోజర్స్ కళ్ళలో, మాటలలో నేను నిరాశను చూశా, సంగీత పరిశ్రమలో మాఫియా చిత్ర పరిశ్రమ కంటే పెద్దది" అని సోనూ వ్యాఖ్యానించారు.