బాలయ్యకి విలన్ గా చిరు తమ్ముడు

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ మూవీ తర్వాత బాలయ్య తనకి ఇష్టమైన అచ్చొచ్చిన బోయపాటితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ సిన్నిమా మీద ఇంకా ప్రకటన లేకుండానే భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే బోయపాటి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర వార్తలు హల్చల్ చేస్తున్నాయి, అందుకో నిజం ఎంతుందో తెలియదు కానీ ఈ సినిమా గురించిన కొన్ని పుకార్లు భీబత్సంగా హల్చల్ చేస్తున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో.. విలన్ కూడా అంతే బలంగా, పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి. ఈ సినిమా ద్వారా సీనియర్ హీరో శ్రీకాంత్‌ను తీసుకునే ఆలోచనలో బోయపాటి ఉన్నట్టుగా తెలుస్తోంది.
శ్రీకాంత్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఇప్పటికే యుద్ధం శరణం సినిమాలో విలన్ గా కనిపించాడు. అంతేకాకుండా ఓ మలయాళ చిత్రంలోనూ విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమాలు శ్రీకాంత్ కి పెద్ద బ్రేక్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీకాంత్ ని విలన్ గా చూపించాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఫ్యామిలీ హీరోస్ ని విలన్ గా చూపించి సక్సెస్ కొట్టడం బోయపటికి పెద్ద విషయమేమీ కాదు. గతంలో లెజెండ్ సినిమాతో జగపతిబాబుని విలన్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు జగపతిబాబు టాప్ విలన్స్ లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు అలాగే శ్రీకాంత్ కి కూడా విలన్ గా బ్రేక్ ఇచ్చే పనిలో ఉన్నాడట బోయపాటి.