బ్రేకింగ్ న్యూస్.. రాజమౌళికి కరోనా నెగెటివ్..

2020-08-12 17:38:18
టాలీవుడ్ ప్రముఖ దర్మకధీరుడు రాజమౌళికి, అతని కుటుంబ సభ్యులకు కరోనా నెగెటివ్ వచ్చింది. నిర్దారణ పరీక్షలో నెగెటివ్ వచ్చిందని సంతోషంతో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. కరోనా వైరస్ ఎవర్నీ వదలడం లేదు. టాలీవుడ్ లో చాలామందికి సోకినట్టే రాజమౌళి కుటుంబానికి కూడా కరోనా వైరస్ సోకింది. డైరెక్టర్ రాజమౌళిది మొదటి నుంచీ ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసి ఒకే అపార్ట్మెంట్లో వివిధ ఫ్లాట్స్లో నివసిస్తూంటారు. ఇక షూటింగ్స్ సమయాల్లో ఉదయం, సాయంత్రం కలుసుకోవడం, వారాంతాల్లో గెట్టూగెదర్లా అందరూ కలిసే ఉంటారు. రాజమౌళి ఫ్యామిలీతో పాటు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్, కీరవాణి ఫ్యామిలీ ఆయన తండ్రి శివశక్తి దత్తా ఇలా అందరూ ఒకే చోట కలిసి అన్యోన్యంగా ఉంటారు.