జయప్రకాష్ రెడ్డి మృతికి సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం..

సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి అకాల మరణం తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు ఆయన సన్నిహితులను రాజకీయ ప్రముఖులను కూడా విషాదంలోకి నెట్టేసింది. ఆయన మరణవార్త తెలియగానే చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మీరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నటుడి మృతికి సంతాపం తెలియజేశారు. అలాగే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది అంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ పెద్దలు ప్రముఖులు కూడా జయప్రకాశ్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన లేరు అనే విషయం నమ్మలేకపోతున్నామంటూ సోషల్ మీడియా లో సంతాపం వ్యక్తం చేశారు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ సహా ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు జయప్రకాష్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ ఈయన మృతిపై ప్రత్యేకంగా ఒక లేఖను విడుదల చేశాడు. జయ ప్రకాష్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. పలువురు దర్శకులు నిర్మాతలు కూడా జయప్రకాష్ రెడ్డి లాంటి నటుడు మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి దొరకడు అంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.