మల్లేశంగా ముందు నానిని, విజయ్ దేవరకొండని అడిగారట

ప్రియదర్శి టైటిల్ రోల్ లో నటించిన బయోపిక్ సినిమా మల్లేశం, ఈ సినిమా రిలీజ్ అవక ముందు నుండే స్పెషల్ షోల ద్వారా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక రిలీజ్ అయిన మొదటి ఆట నుండే ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నారు ఈ సినిమా దర్శక నిర్మాత రాజ్. చింతకింది మల్లేశం గురించి తెలుసుకున్నాక, ఆయనను కలుసుకుని సినిమా తీయాలని అనుకుంటున్నానని ఆయనకీ చెప్పి ఆయన అనుమతి తీసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాక. మల్లేశం పాత్రకి నానీ లేదా విజయ్ దేవరకొండ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో వారి డేట్స్ కోసం ప్రయత్నాలు చేశారట. అయితే మరో మూడేళ్ల వరకూ వాళ్ల కాల్షీట్స్ లేవని తెలియడంతోనే ప్రియదర్శిని ఈ ప్రాజెక్ట్ వరించిందట. అయితే ముందు దర్శకత్వం చేద్దామని అనుకోలేదని కానీ అంతా సిద్ధం చేసుకున్న తరువాత దర్శకత్వం కూడా తానే చేస్తే మంచిదని తానే రంగంలోకి దిగానని, ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక సినిమా చూసిన అందరూ ఈ సినిమాలో మల్లేశం పాత్రకి ప్రియదర్శి వంద శాతం న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు.