న్యూ ఇయర్ సర్ప్రైజ్ లు ఇచ్చి మరీ శుభాకాంక్షలు

ఎన్నో జ్ఞాపకాలతో కూడిన 2019 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి 2020కి ఘన స్వాగతం పలికారు ప్రపంచ వాసులు. పరపంచం సంగతి పక్కన పెడితే. ఈ నూతన సంవత్సరంలో కోరుకున్న పనులు జరగాలని, ఈ ఏడాది కూడా మంచి జ్ఞాపకాలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కొద్ది గంటల మందే 2019కు వీడ్కోలు పలికి 2020కు ప్రపంచమంతా గ్రాండ్ వెల్కం చెప్పింది ప్రపంచం. ఇక ఈ క్రమంలో సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఇక టాలీవుడ్ సినిమా విషయానికి వస్తే ఈ ఏడాది తొలి సినిమాగా రామ్ గోపాల్ వర్మ కంపెనీ నుండి బ్యూటీఫుల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రంగీలా సినిమా స్టైల్లో ఈ చిత్రం ఉంటుందని గత కొద్దిరోజులుగా ఈ చిత్ర ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు వర్మ. ఇక న్యూ ఇయర్ సందర్భంగా 2020లో విడుదల కానున్న డిస్కోరాజా, ఆర్ఆర్ఆర్, వరల్డ్ ఫేమస్ లవర్, ఇండియన్ 2, మాస్టర్, దర్బార్, రెడ్, అల.. వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు , ఎంత.. మంచి వాడవురా, ఇచ్చట వాహనములు నిలపరాదు, ప్రేమపిపాసి వంటి పలు చిత్రాల పోస్టర్స్ విడుదల చేసి ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. అలా నూతన సంవత్సరాదిన ప్రేక్షకులకు ట్రీట్ ఇస్తూ వారికీ శుభాకాంక్షలు చెబుతున్నారు మేకర్స్.