ఎవరికీ భయపడని వర్మను.. మెగా ఫ్యామిలీ భయపెట్టిందా..

ఎవరికీ భయపడని సీతయ్య ఎవరైనా ఉన్నారా అంటే అది వర్మ ఒక్కడే. లోపల ఎంత భయపడతారో లేదో తెలియదు కానీ బయటికి మాత్రం తాను ఎవరికీ భయపడనని అంటూ గొప్పలు చెప్తుంటాడు. అయితే ఇప్పుడు ఇలాంటి దర్శకుడికి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నిర్మాత నుంచి బెదిరింపులు వెళ్లాయని తెలుస్తోంది. ఈమధ్య కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా విషయంలో ప్రమోషన్ చేసుకుంటూ సడన్ గా మెగాఫ్యామిలీపై పడ్డాడు వర్మ. తన ట్విట్టర్ లో మెగా ఫ్యామిలీ అనే టైటిల్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. దాంతో అది కాస్తా సంచలనంగా మారింది. ఉన్నట్టుండి మెగా ఫ్యామిలీని వర్మ టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకు చిరంజీవితో పాటు అతని కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు అంటూ అభిమానులు కూడా ఈ దర్శకుడు పై మండిపడ్డారు. కానీ ఏమనుకున్నాడో తెలియదు మరి ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే మళ్లీ దాన్ని డిలీట్ చేశాడు వర్మ.
ఒక వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు అదే తన మెగా ఫ్యామిలీ కథ అంటూ సెటైర్లు వేశాడు దర్శకుడు. కానీ తర్వాత ఆయన ఈ సినిమా విషయంలో వెనుకడుగు వేయడానికి అసలు కారణం ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నిర్మాత ఆయనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడమే అని తెలుస్తోంది. రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్న నిర్మాత రాంగోపాల్ వర్మకు ఫోన్ చేసి అనవసరంగా మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అంటూ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే వర్మ వెనకడుగు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడే అందరికీ ఒక లాజిక్ బుర్రలో మెదులుతుంది. చంద్రబాబు హయాంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటి సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు చిరంజీవి వర్గం నుంచి వచ్చే బెదిరింపులకు భయపడ్డాడా అనేదే అసలు ప్రశ్న.