రాజువయ్యా...మహారాజువయ్యా సోనూ

ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా మారాడు. ఎందుకంటే తెర మీద విలన్ వేషాలు వేసే ఈ నటుడు కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులని ఆదుకునేందుకు సొంత ఖర్చుతో రైళ్ళు, ఫ్లైట్స్ ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాలకి తరలిస్తూ ఎంతో మంది మన్ననలను అందుకుంటున్నారు. అయితే ఆయన సేవ చూసి చాలా మంది మెచ్చుకుంటుంటే కొందరు మాత్రం ఆయనను విమర్శిస్తున్నారు. అయినా ఆయన ఎటువంటి వెనకడుగు వేయకుండా సేవ చేస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో చాలా వరకూ ప్రయాణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా సరే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లేంత స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా సోనూ సాధ్యమయినంత సాయం చేస్తున్నాడు.
సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే ఈ సోనూ ఒక్కసారిగా రియల్ హీరో అయ్యారు. నిన్నటి నుండి ఆయన సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో మారాడు. ఎందుకంటే డబ్బు లేక ఎద్దులు బదులు కూతుళ్ళను కాడికి కట్టి పొలం దున్నడం చూసి ఆయన సాయంత్రానికి ట్రాక్టర్ కొనిపెట్టాడు. అది కాక నిన్న లాక్డౌన్ కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన శారద..తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూరగాయల వ్యాపారం చేస్తున్నట్టు మీడియాలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఈ విషయం సోనూ దృష్టికి వెళ్ళడంతో శారద ఫోన్ నంబర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. శారదకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని సోనూసూద్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో సోనూ మీద అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.