22 ఏళ్ల తర్వాత కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్...కానీ విక్రమ్

నటుడు, నిర్మాత తాజాగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన కమల్‌హాసన్ అట్టహాసంగా ఒక సినిమా ఓపెనింగ్ చేశాడు. 1997లో ఎలిజబెత్ రాణి2 చేతుల మీదుగా ప్రారంభమైన ‘మరుదనాయగం’ సినిమా అనేక కారణాల వల్ల మూలనపడింది. అది ఇక అటక ఎక్కేసినట్టే అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈ సినిమా గురించి ఆశ్చర్యకరమైన వార్త బయటికొచ్చింది. దాదాపు 22 ఏళ్లు గడిచిపోయిన తర్వాత ఈ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో ‘మరుదనాయగం’ తప్పకుండా తెరపై చూస్తారని కానీ అందులో నన్ను చూడలేకపోవచ్చని చెప్పాడు.
అయితే ఈ సినిమాలో కమల్ స్థానంలో విక్రమ్ నటించనున్నాడని వార్తలొస్తున్నాయి. అప్పట్లో ఈ చిత్రాన్ని కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ప్రొడక్షన్స్‌పై మీద నటించమని విక్రమ్‌ను సంప్రదించారట. ఎందుకంటే విక్రమ్ గతంలో ఇదే బ్యానర్‌పై ‘కదరం కొండన్’ (తెలుగులో మిస్టర్ కేకే) సినిమా చేశాడు. ఆ పరిచయంతో అడగడంతో ఆయన ఒప్పుకున్నాడని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విక్రమ్ చేతుల్లో చాలా సినిమాలున్నాయి. జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘విక్రమ్ తన 58వ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క మణిరత్నం నిర్మిస్తున్న ఆయన డ్రీం ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’లోనూ విక్రమ్ నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయ్యాక ఈ సినిమా తప్పకుండా చేస్తానని ఆయన మాట ఇచ్చినట్టు సమాచారం.