English   

అయ్యో పాపం.. క్రిష్ ప‌రిస్థితేంటి ఇప్పుడు..?

Krish
2019-02-28 11:06:35

ఒక్క ఫ్లాప్ వచ్చిన దర్శకులనే మన ఇండస్ట్రీలో అసలు పట్టించుకోరు. అలాంటిది ఒకే సినిమాతో రెండు డిజాస్టర్లు అందుకున్నాడు దర్శకుడు క్రిష్. ఇలాంటి అరుదైన దురదృష్టమే ఈయ‌న‌కు తప్ప ఎవరికీ రాదేమో. ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి జీవితాన్ని తెరకెక్కించే బాధ్యతను బాలకృష్ణ ఈయన చేతుల్లో పెట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత కచ్చితంగా ఏదో చేస్తాడని అభిమానులు కూడా బలంగా నమ్మారు. అందుకే ఈ సినిమాకు బిజినెస్ కూడా చాలా ఎక్కువగా జరిగింది. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా 70 కోట్లకు పైగా కథానాయకుడు బిజినెస్ జరిగింది. అయితే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క‌థానాయ‌కుడు కేవ‌లం 20 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఆ తర్వాత మహానాయకుడు ఉచితంగా ఇచ్చినా కూడా ఇది కూడా డిజాస్టర్ అయింది. 

రెండు సినిమాలు ఒకేసారి డిజాస్టర్ కావడంతో క్రిష్ కెరియర్ ఇప్పుడు ఎటు వెళుతుందో తెలియని నావ‌లా మారిపోయింది. చుట్టూ సముద్రం కనిపిస్తుంది కానీ తీరం మాత్రం కనిపించడం లేదు ఈ దర్శకుడికి. మ‌ణిక‌ర్ణిక సినిమా కంగనా రనౌత్ ఖాతాలోకి వెళ్ళిపోతే ఎన్టీఆర్ డిజాస్టర్ ఫలితం మాత్రం క్రిష్ ఖాతాలోకి వచ్చింది. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా తనను తాను నిరూపించుకోవాలంటే ఒక సినిమా తీసి హిట్ కొట్టి చూపించాల్సిందే. ఈయన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క కమర్షియల్ హిట్ అందుకున్నాడు. దాని పేరు గౌతమీపుత్ర శాతకర్ణి. దానికి ముందు తర్వాత చేసిన సినిమాలు అన్నీ కమర్షియల్ గా పెద్ద‌గా ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు కచ్చితంగా క్రిష్ ఏదో ఒక మాయ చేయాల్సిందే.. మరో ఆప్షన్ కూడా ఈయ‌న‌కు లేదు. మ‌రి ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడేం చేస్తాడో చూడాలిక‌. 

More Related Stories