వర్మ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. పవన్ను టార్గెట్ ఎందుకు..

రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా రెచ్చిపోతున్నాడు వర్మ. ఆయనెందుకు అలా చేస్తున్నాడో తెలియదు కానీ వరసగా ఆయనపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా పవర్ స్టార్ అంటూ సినిమా కూడా అనౌన్స్ చేసాడు. పోస్టర్లు కూడా విడుదల చేస్తున్నాడు. అవి చూసి అంతా షాక్ అవుతున్నారు కూడా. పవన్ కళ్యాణ్ ను పోలిన వ్యక్తిని పట్టుకుని పవర్ స్టార్ సినిమా చేస్తున్నాడు వర్మ. అసలు ఉన్నట్లుండి ఇప్పుడు పవర్ స్టార్ ను వర్మ ఎందుకు టార్గెట్ చేసినట్లు అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. మొన్నటి వరకు అసలు తాను పవన్ కళ్యాణ్ ను టచ్ చేయనంటూ మాటిచ్చిన వర్మ.. ఇప్పుడు మాత్రం సినిమా చేస్తున్నాడు. ఎన్నికల తర్వాత చిత్రం అంటూ వస్తున్నాడు ఈయన.
మెగా కుటుంబాన్ని ఆయన లక్ష్యంగా చేసుకోవడం వెనక అసలు కథేంటో అంతు చిక్కక అభిమానులు కూడా తంటాలు పడుతున్నారు. వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఊహించడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పవర్ స్టార్ సినిమాలో పవన్ వ్యక్తిగత జీవితాన్ని కూడా హైలైట్ చేస్తున్నాడు వర్మ. అందులో రష్యన్ గాళ్ ను కూడా చూపిస్తున్నాడు. ఓ పోస్టర్ లో రష్యన్ గాళ్.. మరో పోస్టర్ లో చిరంజీవితో కూర్చున్నట్లు.. ఇంకో పోస్టర్ లో చిరంజీవి ఓదారుస్తున్నట్లు ఇలా చాలా విడుదల చేసాడు ఈ దర్శకుడు. ఇవన్నీ చూస్తుంటే బాగానే రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూడాలిక.. పవర్ స్టార్ సినిమా ఎలా ఉండబోతుందో..?