చిరువి ఆ రెండు సినిమాలు వరుణ్ కి సూట్ అవుతాయి

చిరంజీవి సినిమా పాటల రీమిక్స్ చేస్తూ రచ్చ చేసేవాడు మెగా మేనల్లుడు ధరమ్ తేజ్. అయితే ఏమయిందో ఏమో కానీ అసలు తాను ఇక ఆ రీమిక్స్ లు చేయనని ప్రకటించి సైలెంట్ అయ్యాడు. అయితే ఇప్పటిదాకా చిరు పాటలు రీమిక్స్ చేశారు కానే ఆయన సినిమాలు ఏవీ రీమేక్ చేయాలనే ఆలోచన చేయలేదు. అయితే ఒక వేళ రీమేక్ చేయాల్సి వస్తే..తేజ్ ఆ రెండు రీమేక్స్‌లో బాగుంటాడని అంటున్నారు వరుణ్ తండ్రి నాగబాబు. చిరంజీవి సినిమాల రీమేక్స్ లో మెగా హీరోలు నటించాల్సి వస్తే.. ఆ లిస్ట్‌లో ఖైదీ.. జగదేకవీరుడు..అతిలోక సుందరి.. గ్యాంగ్‌లీడర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉంటాయనటంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాల కంటే కూడా తన కొడుక్కి ఛాలెంజ్, కొదమ సింహంల రీమేక్స్ కు మాత్రమే సూట్ అవుతాయంటున్నాడు.
చిరంజీవి హిట్ సినిమాల్లో ఈ ఛాలెంజ్ కూడా ఒకటి. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.యస్ రామారావు నిర్మించిన ఈ సినిమాలో తన కొడుకుని చూడాలనుకుంటున్నాడు నాగబాబు. అలాగే హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో తెరకెక్కిన కొదమ సింహంలో చిరంజీవి కౌబాయ్ పాత్ర పోషించారు. సుమారు 30 ఏళ్ల క్రితం వచ్చిన కొదమసింహంను కె. మురళీ మోహనరావు దర్శకత్వంలో కైకాల సొంత బేనర్ రమా ఫిలింస్ సంస్థ నిర్మించింది. సోనమ్, రాధ, ప్రాణ్, మోహన్‌బాబు తదితరులు నటించిన ఈ సినిమాకి రాజ్ కోటి మ్యూజిక్ హైలైట్. ఈ రెండు సినిమాలు తన కొడుక్కి సూట్ అవుతాయని ఈ రెండు సినిమాలు వరుణ్ రీమేక్ చేస్తే చూడాలని ఉందని అంటున్నారు నాగబాబు. ఛాలెంజ్‌లో చిరంజీవి పోషించిన గాంధీ పాత్రకు.. కొదమసింహంలో కౌబాయ్ పాత్రకు వరుణ్ బాగా సెట్ అవుతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నాగబాబు. చూద్దాం ఫ్యూచర్ లో వరుణ్ ఆ సాహసం చేస్తాడేమో.