English   

నాగ్ ఫ్లాప్ సినిమాపై క‌న్నేసిన రాజ‌మౌళి..

ntr-charan
2018-01-17 10:20:56

అవును.. విన‌డానికి కాస్త వింత‌గా అనిపించినా ఇదే నిజం. ఇప్పుడు రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్ కు తెర‌తీస్తున్నాడు. ఇన్నాళ్లూ తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలంటే ఒక సీనియ‌ర్.. మ‌రో జూనియ‌ర్ క‌లిసి న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల‌న్నీ అలా వ‌చ్చిన‌వే. ఈ మ‌ధ్య కాలంలో ఎక్కువ‌గా అదే జ‌రుగుతుంది. అయితే తొలిసారి ఒకే ఇమేజ్ ఉన్న ఇద్ద‌రు కుర్ర హీరోల‌ను క‌లిపి చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌క ధీరుడు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోల‌తో మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప్ర‌స్తుతం వేగంగా జ‌రుగుతుంది. ఈ అక్టోబ‌ర్ లో సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే క‌థ కూడా పూర్తైపోయింది. ప్ర‌స్తుతం తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ తో క‌లిసి క‌థా చ‌ర్చ‌ల్లో బిజీగా ఉన్నాడు రాజమౌళి. ఇది ఇలా ఉంటే ఈ చిత్రానికి నాగార్జున పాత సినిమా టైటిల్ ఒక‌టి ప‌రిశీలిస్తున్నారు. అది కూడా ఫ్లాప్ సినిమా టైటిల్. అదే ఇద్ద‌రూ ఇద్ద‌రే. అప్ప‌ట్లో తండ్రి నాగేశ్వ‌ర‌రావ్ తో క‌లిసి నాగార్జున న‌టించిన సినిమా ఇది. ఓన‌మాలు నేర్పించాల‌ని పాట ఈ సినిమాలోనిదే. ఈ టైటిల్ అయితే ఇప్పుడు తాను చేయ‌బోయే సినిమాకు ప‌ర్ ఫెక్ట్ గా సూట్ అవుతుంద‌ని భావిస్తున్నాడు రాజ‌మౌళి. యూనిట్ కూడా ఇదే టైటిల్ వైపు మొగ్గు చూపుతుంది. దాంతో ప‌ట్టాలెక్క‌క ముందే ఈ చిత్ర టైటిల్ ప‌క్కా అయిపోయేలా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక.. మెగా నంద‌మూరి వారి ఇద్ద‌రూ ఇద్ద‌రే ఎలా ఉండ‌బోతుందో..?
 

More Related Stories