English   

వ‌ర్మ మ‌రీ తెగించేసాడు.. ట్రైల‌ర్ వ‌చ్చింది.. 

ram gopal
2018-01-16 11:47:24

తాను అనుకున్న‌ది చేయ‌డంలో వ‌ర్మ‌ను మించినోళ్లు లేరు. ఇది చేస్తే వాళ్లు ఏమ‌నుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అనే భ‌యాలేవీ వ‌ర్మ‌లో ఉండ‌వు. అందుకే ఆయ‌న ఏది కావాలంటే అది చేస్తుంటాడు. ఇప్ప‌టికే ఎన్నో వివాదాలు సృష్టించిన వ‌ర్మ‌.. ఇప్పుడు గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అంటూ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీస్తున్నాడు. ఈయ‌న తెర‌కెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైల‌ర్ విడుద‌లైందిప్పుడు. సెక్స్ తో పాటు గాడ్ ను కూడా ఇందులో క‌లిపాడు వ‌ర్మ‌. దాన్ని బ‌ట్టే దేవుడిపై ఆయ‌న  కోణం ఏంటో అర్థ‌మైపోతుంది. ఇక ఆడాళ్లంటే కేవ‌లం వ‌ర్మ‌కు సెక్స్ కు ప‌నికొచ్చే వాళ్లు మాత్ర‌మే. అది ఈ షార్ట్ ఫిల్మ్ తోనే అర్థ‌మైపోతుంది. ఇండియ‌న్ సినిమా రేంజ్ ను హాలీవుడ్ కు తీసుకెళ్తా అంటే ఏంటో అనుకున్నాం కానీ ఇలా పోర్న్ సినిమాలు చేసి హాలీవుడ్ రేంజ్ కు వెళ్తాడ‌ని ఎవ‌రూ ఊహిచ‌లేదు. ఒక‌ప్పుడు ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు చేసిన ఆయ‌న టాలెంట్ చూసి గ‌ర్వ‌ప‌డాలో.. లేదంటే ఆ టాలెంట్ మ‌రోలా వెళ్లిపోతుంద‌ని బాధ ప‌డాలో అర్థం కావడం లేదిప్పుడు. 

కొత్త‌ద‌నం పేరు చెప్పి ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తున్నాడు వ‌ర్మ‌. మ‌రీ ముఖ్యంగా ఆయ‌న చేస్తోన్న సినిమాలు ఇప్పుడు చాలా విమ‌ర్శ‌ల‌కు తావిస్తున్నాయి. తాజాగా ఈయ‌న నుంచి గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ అనే షార్ట్ ఫిల్మ్ వ‌స్తుంది. ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైందిప్పుడు. ఇది చూసిన త‌ర్వాత ఆడాళ్ల‌పై వ‌ర్మ‌కు ఉన్న ఆలోచ‌న ఏంటో అర్థమైపోతుంది. ఆయ‌న‌కు అమ్మాయి అంటే సెక్స్ అంతే.. అంత‌కుమించి మ‌రోటి లేదు.. అమ్మాయిలు సెక్స్ కు త‌ప్ప ఇంకెందుకు ప‌నికిరారు అనేది వ‌ర్మ భావ‌న‌. దానికి ముందు అప్ప‌ట్లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు కూడా ఇలాంటి మాట ఒక‌టి అన్నాడు. ఆడాళ్లు ప‌క్క‌లోకి ప‌నికొస్తారు అని.. ఇప్పుడు వ‌ర్మ‌ను చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. ఈయ‌న భావ‌న కూడా దాదాపు చ‌ల‌ప‌తిరావు మాదిరే ఉంది. ఆడాళ్లు అందుకు త‌ప్ప ఎందుకూ ప‌నికిరారేమో అన్నంత‌గా చూపించాడు ఈ షార్ట్ ఫిల్మ్ లో. ఇది ఎందుకోసం వ‌ర్మ ఇప్పుడు తీస్తున్నాడో ఆయ‌న‌కే తెలియాలి మ‌రి..! జ‌న‌వ‌రి 26.. గ‌ణ‌తంత్రం రోజు ఈయ‌న చేసిన షార్ట్ ఫిల్మ్ కు స్వాతంత్ర్యం రానుంది.

More Related Stories