English   

జై ల‌వ‌కుశ‌.. 100 కోట్లు ఖాయం..

Jai-Kava-Kusa-100-Crores-Confrom

ఊహించిందే జ‌రుగుతుంది.. అనుకున్నంతా అవుతుంది.. జై ల‌వ‌కుశ వ‌సూళ్లు సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తూనే ఉంది. ఈ సినిమా జోరుకు ఎవ‌రూ అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. రెండో రోజు కాస్త త‌గ్గిన‌ట్లు అనిపించినా కూడా మూడో రోజుకు మ‌ళ్లీ పుంజుకున్నారు జై ల‌వ‌కుశ‌. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్ అందుకుంది. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో ఖైదీ నెం.150ని అనుస‌రిస్తున్నాడు ఎన్టీఆర్. చిరంజీవి రికార్డుల్ని దాట‌లేక‌పోయినా.. మెగాస్టార్ వెన‌కాలే అడుగేస్తున్నాడు. నాలుగు రోజుల వీకెండ్ లో 100 కోట్లు సాధిస్తుంద‌ని ముందే అంచ‌నా వేసారు. కానీ 90 కోట్ల వ‌ర‌కు ఇది వ‌చ్చేలా క‌నిపిస్తుంది. మ‌రో 10 కోట్లు రావ‌డం కూడా పెద్ద క‌ష్ట‌మేం కాదు. ఎందుకంటే ద‌స‌రా హాలీడేస్ ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. దాంతో సెప్టెంబ‌ర్ 27న స్పైడ‌ర్ వ‌చ్చే వ‌ర‌కు జై ల‌వ‌కుశ‌దే హ‌వా.

దాంతో తొలి వారంలోనే 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 100 కోట్ల గ్రాస్ అంటే దాదాపు 68 కోట్ల షేర్ అన్న‌మాట‌. ఈ లెక్క‌న మ‌రో 20 కోట్లు వ‌సూలు చేస్తే గానీ జై ల‌వ‌కుశ‌ను హిట్ అన‌లేం. ఆ లోపు స్పైడ‌ర్ కూడా వ‌చ్చేస్తుంది. సెప్టెంబ‌ర్ 27న స్పైడ‌ర్ ప్ర‌పంచ వ్యాప్తంగా 3000 థియేట‌ర్స్ లో విడుద‌ల కానుంది. జై ల‌వ‌కుశ థియేట‌ర్స్ కూడా అందులో చాలా వ‌ర‌కు వెళ్లిపోతాయి. అయితే సినిమాకు పాజిటివ్ టాక్ ఉండ‌టం.. ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం.. ద‌స‌రా సెలువులు ఉండ‌టం.. స్పైడ‌ర్ కు మాస్ అప్పియ‌రెన్స్ లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ జై ల‌వ‌కుశ‌కు క‌లిసొచ్చేలా క‌నిపిస్తున్నాయి. మ‌రి చూడాలి.. ఇన్ని అడ్వాంటేజ్ ల మ‌ధ్య జై ల‌వ‌కుశ ప్ర‌యాణం ఎంత దూరం వెళ్తుందో..?

More Related Stories