English   

జ‌వాన్ మూవీ రివ్యూ రేటింగ్

Jawaan-Movie-Review-Rating

జ‌వాన్.. ఈ మ‌ధ్య కాలంలో బాగా వినిపించిన పేరు ఇది. విన్న‌ర్, తిక్క లాంటి ఫ్లాపుల త‌ర్వాత సాయిధ‌రంతేజ్ నుంచి వ‌చ్చిన సినిమా ఇది. పైగా దిల్ రాజు ఈ చిత్రానికి అండ‌గా ఉన్నాడు. దాంతో జ‌వాన్ పై అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి నిజంగానే ఈ జ‌వాన్ అంచ‌నాలు అందుకున్నాడా..

క‌థ‌ : జై (సాయిధ‌రంతేజ్) ఆర్ఎస్ఎస్ భావాలున్న విధ్యార్థి. స‌మాజంపై.. దేశంపై ఎంతో గౌర‌వం ఉన్న కుటుంబం నుంచి వ‌స్తాడు. డిఆర్డివోలో ఉద్యోగం చేయాల‌నేది జై క‌ల. డిఆర్డివో ఆక్టోపస్ అనే పెద్ద మిస్సైల్ ను త‌యారు చేస్తుంది. దానివ‌ల్ల శ‌త్రుదేశాల‌ను నామ‌రూపాల్లేకుండా మ‌ట్టుపెట్టొచ్చు. ఆ మిస్సైల్ ను తీసుకురావాల‌ని కేశ‌వ(ప్ర‌స‌న్న)తో డీల్ కుదుర్చుకుంటారు కొంద‌రు. అప్ప‌ట్నుంచీ ఆక్టోప‌స్ కోసం చేసే ప్ర‌తీ ప‌నిలోనూ కేశ‌వకు జై అడ్డుప‌డ‌తాడు. అస‌లు చివ‌రికి ఆక్టోప‌స్ చేరాల్సిన చోటికి చేరిందా లేదా అనేది క‌థ‌..

క‌థ‌నం : దేశం కోసం ప్రాణాలిచ్చేయ్.. అంత‌కంటే గొప్పేముంది మ‌న‌కు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు జ‌వాన్ కూడా అలాంటి ప్ర‌య‌త్న‌మే. వాంటెడ్ లో రివేంజ్ ఫార్ములా తీసుకుని బుక్కైపోయిన బివిఎస్ ర‌వి.. ఈ సారి మాత్రం దేశం అనే యూనిక్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. దేశం కోసం ప్రాణాలిచ్చే దేశ‌భ‌క్తుడు ఒక‌రు.. దేశం ఏమైపోయినా ప‌ర్లేదు నేను బాగుంటే చాలు అనుకునే స్వార్థ‌ప‌రుడు ఒక‌రు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే క‌థ జ‌వాన్. చాలా సింపుల్ పాయింట్ ను తీసుకున్నా.. దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నాడు బివిఎస్ ర‌వి. తెలిసిన క‌థే అయినా కూడా చాలా చోట్ల ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసాడు. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ప‌రుగులు పెట్టించాడు క‌థ‌ను. ఎక్క‌డా పెద్ద‌గా ట్విస్టులేవీ లేకుండానే స్టెప్ బై స్టెప్ క‌థ చెప్పుకుంటూ వెళ్లిపోయాడు బివిఎస్ ర‌వి.

హీరో డిఆర్డివోకు ఎంపిక కాక‌పోవ‌డం.. ఆ త‌ర్వాత దేశం కోసం ఏ ఛాన్స్ వ‌చ్చినా వ‌దులుకోకూడ‌ద‌ని సొంత మిష‌న్ స్టార్ట్ చేయ‌డం.. విల‌న్ కు ప్ర‌తీ స్టెప్ లో అడ్డుప‌డ‌టం.. మైండ్ గేమ్ ఆడ‌టం.. ఇదంతా ఫ‌స్టాఫ్ లో చ‌క‌చ‌కా జ‌రిగిపోతాయి. ట్విస్ట్ ఏం లేకుండానే ఇంట‌ర్వెల్ బ్యాంగ్ కూడా వ‌స్తుంది. అస‌లు క‌థ మాత్రం సెకండాఫ్ లోనే మొద‌ల‌వుతుంది. అయితే ఫ‌స్టాఫ్ లో విల‌న్ కు ఆక్టోప‌స్ డీల్ ఇచ్చింది ఎవ‌రు అనే విష‌యం మాత్రం సినిమాలో చెప్ప‌డు ద‌ర్శ‌కుడు. అది శ‌త్రుదేశం అని ప్రేక్ష‌కులే ఊహించుకోవాలేమో..! అప్ప‌టికే క‌థ తెలిసిపోవ‌డంతో అప్ప‌ట్నుంచి  హీరో, విల‌న్ మ‌ధ్య‌ మైండ్ గేమ్ జ‌రుగుతుందేమో అని ఊహించుకుంటాం.

కానీ విల‌నే హీరో ఇంటికి వ‌చ్చి ఉండ‌టంతో ప్ర‌తీ విష‌యాన్ని హీరోనే రివీల్ చేస్తుంటాడు.. నిజానికి అక్క‌డ్నుంచి విల‌న్ హీరోను ఇంకా ఇబ్బంది పెట్టే సీన్స్ చాలా రాసుకుని ఉండొచ్చు కానీ ఎందుకో మ‌రి ఆ వైపుగా ఆలోచించ‌లేదు ద‌ర్శ‌కుడు. దాంతో క‌థ లాగిన‌ట్లు అనిపించింది. హీరో ఇంట్లోనే ఉండి విల‌న్ ఆప‌రేట్ చేసే విధానం ఆస‌క్తిక‌రంగా ఉంటుందేమో అనుకుంటే నీర‌సంగా సాగింది. అయితే మ‌ధ్య‌మ‌ధ్య‌లో దేశం గురించి చెప్పే కొన్ని సీన్స్ మాత్రం బాగా ఆక‌ట్టు కున్నాయి. ఇక హీరోయిన్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినిమాలో ఐదు పాట‌లుంటే.. అందులో హీరోయిన్ తో నాలుగు ఉన్నాయి. అంటే స‌రిగ్గా పాట టైమ్ కు ముందే ఓ సీన్ రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అలా హీరోయిన్ సినిమాలో క‌నిపించింది. క్లైమాక్స్ కూడా తేల్చేసాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా జ‌వాన్ ఒక్క‌సారి ఓకే అనిపిస్తుంది కానీ కిక్ మాత్రం ఇవ్వ‌దు.

న‌టీన‌టులు : సాయిధ‌రంతేజ్, మెహ్రీన్, ప్ర‌స‌న్న‌, జ‌య‌ప్ర‌కాశ్..  క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: బివిఎస్ ర‌వి నిర్మాత: కృష్ణ  జ‌వాన్ గా సాయిధ‌రంతేజ్ ర‌ప్ఫాడించాడు. మ‌నోడికి పేరు పెట్టాల్సిన ప‌నేలేదు. సినిమా సినిమాకు ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాడు సాయి. మ‌రీ ముఖ్యంగా కొన్ని స‌న్నివేశాల్లో ఒక‌ప్ప‌టి చిరంజీవిని గుర్తుకు తెచ్చాడు సాయిధ‌రంతేజ్. మెహ్రీన్ ఇలా పాట‌ల‌కు వ‌చ్చి వెళ్లిపోయే పాత్ర‌. ప్ర‌స‌న్న చాలా బాగా చేసాడు. విల‌న్ గా ఆయ‌న సినిమాను మ‌రో లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. మిగిలిన వాళ్ల‌లో హీరో తండ్రిగా జ‌య‌ప్ర‌కాశ్ బాగా చేసారు. నాగ బాబు కమీష‌న‌ర్ గా ఓకే.

టెక్నిక‌ల్ టీం : థ‌మ‌న్ పాట‌లు బాగోలేవు. రిపీటెడ్ గా అనిపించాయి. ఒక్క జ‌వాన్ టైటిల్ సాంగ్ మాత్ర‌మే బాగుంది. ఆర్ఆర్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు థ‌మ‌న్. కేవీ గుహ‌న్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అయితే కొన్ని నైట్ సీన్స్ మాత్రం ఎందుకో తేడా కొట్టిన‌ట్లు అనిపించాయి. విజువ‌ల్ క్లారిటీ లేదు. ఎడిటింగ్ ప‌ర్లేదు. రెండు గంట‌ల సినిమానే అయినా సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన‌ట్లు అనిపించింది. ద‌ర్శ‌కుడిగా బివిఎస్ ర‌వికి ప‌డే మార్కుల క‌న్నా.. ర‌చ‌యిత‌గా ఎక్కువ ప‌డ‌తాయి. న‌లుగురు మ‌నుషులు క‌లిస్తే కుటుంబం.. కొన్ని ల‌క్ష‌ల కుటుంబాలు క‌లిస్తే దేశం.. కుటుంబం లేక‌పోతే దేశానికి ఏం కాదు.. కానీ దేశం లేక‌పోతే ఏ ఒక్క కుటుంబం ఉండ‌దు లాంటి మంచి డైలాగులు రాసాడు ర‌వి. ద‌ర్శ‌కుడిగా మాత్రం వెన‌క‌బ‌డ్డాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు బాగానే రాసుకున్నా సెకండాఫ్ కాస్త గాడి త‌ప్పాడు.

చివ‌ర‌గా : జ‌వాన్.. విష‌యం ఉంది.

రేటింగ్ 3.5/5

More Related Stories