English   

మ‌హేశ్ ఆయ‌న‌కు ఛాన్సిస్తున్నాడా..? 

mahesh-sukumar

కొన్నిసార్లు కొంద‌రు ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తుంటే అభిమానులు కంగారు ప‌డుతుంటారు. అందులోనూ ఇంత‌కుముందు ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి మ‌రోసారి ఛాన్స్ ఇస్తే మాత్రం క‌చ్చితంగా కంగారు కామ‌న్. ఇప్పుడు మ‌హేశ్ కూడా ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. సుకుమార్ తో ఈయ‌న మ‌రో సినిమా చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. నేడో రేపో ఈ కాంబినేష‌న్ ఖాయం కావ‌డం ఖాయంగా మారింది. అస‌లు ఇండ‌స్ట్రీలో మాయ‌గాడు అనే టైటిల్ ఉంటే అది సుకుమార్ కు ఇచ్చేయాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న కెరీర్ లో ఆర్య త‌ప్ప మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ లేదు. కానీ స్టార్ హీరోలే ఈయ‌న్ని పిలిచి మ‌రీ అవ‌కాశాలిస్తుంటారు. ఈ ద‌ర్శ‌కుడితో సినిమా అన‌గానే హీరోల‌కు ఎలా ఉంటుందో తెలియ‌దు కానీ వాళ్ల ఫ్యాన్స్  మాత్రం వ‌ణికిపోతుంటారు. దానికి కార‌ణం ఆయ‌న సినిమాలు అర్థం కావ‌ట్లేద‌ని. 

ఎన్ని సినిమాలు చేసినా క‌మ‌ర్షియ‌ల్ గా సేఫ్ అయ్యే సినిమా మాత్రం చేయ‌డం లేదు లెక్క‌ల మాస్టారు. ఈయ‌న‌తో సినిమా చేస్తే అది ఆ హీరో కెరీర్ లో డిఫెరెంట్ గా మిగిలిపోతుంది కానీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ గా మాత్రం నిల‌వ‌ట్లేదు. ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు సుకుమార్. రామ్ చ‌ర‌ణ్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇందులో స‌మంత హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. అనుసూయ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. పూజాహెగ్డే ప్ర‌త్యేక‌గీతంలో చిందేయ‌నుంది. ఈ చిత్రం మార్చ్ 30న విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 24న టీజ‌ర్ విడుద‌ల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సినిమా 80ల్లో నేపథ్యంలో తెర‌కెక్కుతోంది. 

రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ ఏం చేస్తాడ‌నే విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. కానీ ఈయ‌న మ‌హేశ్ బాబు కోసం ఓ క‌థ సిద్ధం చేసాడ‌నే టాక్ మాత్రం ఇప్పుడు వినిపిస్తుంది. గ‌తంలోనే నేనొక్క‌డినే లాంటి భిన్న‌మైన సినిమాను మ‌హేశ్ కు ఇచ్చాడు ఈ లెక్క‌ల మాస్టారు. ఈ చిత్రం ఫ్లాపైనా కూడా సుకుమార్ అంటే మ‌హేశ్ కు మ‌హా ఇష్టం. త‌ను ఎప్పుడు అడిగినా మ‌రో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మంటూ చాలాసార్లు చెప్పాడు సూప‌ర్ స్టార్. ఆ న‌మ్మ‌కంతోనే ఇప్పుడు మ‌రో క‌థ సిద్ధం చేసాడు సుకుమార్. మ‌హేశ్ కూడా ఈ క‌థ‌పై ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అప్పుడు వ‌న్ సినిమా చేసి చేతులు కాల్చుకున్న 14 రీల్స్ కే ఇప్పుడు ఈ ఇద్ద‌రూ సినిమా చేయ‌బోతున్నారు. మ‌రి అప్పుడు వ‌చ్చిన న‌ష్టాల‌ను ఇప్పుడు మ‌రో సినిమాతో బ‌య‌ట‌ప‌డేస్తారా లేదంటే మ‌రో ప్ర‌యోగానికి వాళ్ల‌ను ఇంకాస్త బ‌లి చేస్తారా..? ఏమో చూడాలి.. వ‌చ్చే ఏడాది ఈ చిత్రంపై క్లారిటీ రానుంది.
 

More Related Stories