English   

మేడ మీద అబ్బాయి రివ్యూ రేటింగ్

Meda-Meedha-Abbai-Movie-Review-Rating

వ‌ర‌స ఫ్లాపుల‌తో డీలా ప‌డిపోయిన అల్ల‌రి న‌రేష్ కెరీర్ కు మేడ మీద అబ్బాయి చాలా కీల‌కంగా మారింది. ఈ చిత్రంపైనే ఆశ‌ల‌తో ఉన్నాడు న‌రేష్. ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. మ‌రి అల్ల‌రోడి ఆశ‌ల‌ని ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టింది..?

క‌థ‌ : ఎలాగైనా ఇంజనీరింగ్ పూర్తి చేయాల‌నుకునే కుర్రాడు శ్రీను (అల్లరి నరేష్). 24 బ్యాక్ లాక్స్ తో ఊరికి వ‌స్తాడు శ్రీను. దాంతో ఇంట్లో వాళ్ళు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంటూ గొడ‌వ పెడుతుంటారు. ఇలాంటి టైమ్ లో తాను డైరెక్ట‌ర్ అవుతానంటాడు శీను. ఆ కోరిక‌తోనే హైద‌రాబాద్ కు వ‌స్తాడు. కానీ శీను హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత అత‌డి జీవిత‌మే మారిపోతుంది. తిరిగి ఊరికి వెళ్లిన అత‌డిని ఓ అమ్మాయిని ఎత్తుకుపోయాడంటూ కొడ‌తారు. దాంతో మ‌ళ్లీ హైద‌రాబాద్ పారిపోతాడు శీను. అత‌డితో పాటు బండ్ల బాబ్జీ(హైప‌ర్ ఆది) కూడా వ‌స్తాడు. అత‌డి జీవితాన్ని మార్చేసిన సింధు(నిఖిలా విమ‌ల్) ను ప‌ట్టుకోడానికి హైద‌రాబాద్ వ‌చ్చిన శీను జీవితం ఎలా మారిపోయింది..? అస‌లు సింధుతో క‌లిసి శ్రీ‌ను ఎందుకు వెళ్లిపోయాడు అనేది మిగిలిన క‌థ‌..

క‌థ‌నం : ఏ క‌థ‌కైనా ఆది అంతం ఉంటాయి. కానీ మేడ మీద అబ్బాయి విష‌యంలో మాత్రం అది పెద్ద‌గా క‌నిపించ‌దు. ఎక్క‌డ మొద‌లై.. ఎందుకు వ‌చ్చి.. ఎక్క‌డ ఎండ్ అయిపోతుందో అర్థం కాకుండా ఉంటుంది. క‌థ అనేది మొద‌లుపెట్ట‌కుండా ఇంట‌ర్వెల్ వ‌ర‌కు టైమ్ పాస్ చేసాడు ద‌ర్శ‌కుడు ప్ర‌జీత్. ముఖ్యంగా న‌రేష్ అండ్ గ్యాంగ్ పై ఊళ్ళో అర్థం ప‌ర్థం లేని సీన్స్ ను పెట్టాడు. ముఖ్యంగా హీరో ల‌క్ష్య‌మే ద‌ర్శ‌కుడు కావ‌డం అనేంత స్థాయిలో మొద‌ట్లో ఏదో షార్ట్ ఫిల్మ్ చేస్తారు.. కానీ అది పోయినా కూడా హీరోలో ఆ బాధ క‌నిపించ‌దు. మ‌ళ్లీ నార్మ‌ల్ లైఫ్ లోకి వెళ్తాడు. ఇక హైప‌ర్ ఆదితో వేయించిన జ‌బ‌ర్ద‌స్థ్ పంచ్ లు అయితే బోర్ కొట్టించేసాయి. అవి టీవీ వ‌ర‌కు ఓకే గానీ థియేట‌ర్స్ లో వ‌ర్క‌వుట్ కాలేదు. పైగా న‌రేష్ ను డామినేట్ చేసేలా ఆది కారెక్ట‌ర్ డిజైన్ చేయ‌డం వెన‌క ద‌ర్శ‌కుడి అంత‌రార్థ‌మేంటో అత‌డికే తెలియాలి.

ఇంట‌ర్వెల్ లో కూడా ఎలాంటి హంగామా క‌నిపించ‌దు. సెకండాఫ్ కూడా పెద్ద‌గా హ‌డావిడి లేకుండా సాగిపోతుంది. అస‌లు హీరోయిన్ ఎందుకు హైద‌రాబాద్ ఎందుకు వ‌స్తుంద‌నే విష‌యాన్ని త‌ర్వాత రివీల్ చేసినా కూడా అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.. క‌థ ట్రాక్ త‌ప్పింది. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ వ‌చ్చిన త‌ర్వాత కూడా క‌థ పెద్ద‌గా స్పీడ్ అవ్వ‌దు. హీరోయిన్ కు స‌ప‌రేట్ ల‌వ్ స్టోరీ పెట్ట‌డం.. ఆమెకు హీరో స‌పోర్ట్ చేయ‌డం.. ఇవ‌న్నీ ఎన్నో సినిమాల్లో చూసిన‌వే. అవి ఆస‌క్తిక‌రంగా కూడా అనిపించ‌వు. హీరోయిన్ ల‌వ‌ర్ ను ప‌ట్టుకోడానికే క్లైమాక్స్ వ‌ర‌కు స‌రిపోతుంది. ఆ త‌ర్వాత జ‌రిగింది చెప్పినా కూడా ప్రేక్ష‌కుడిలో ఓపిక న‌శిస్తుంది.

న‌టీన‌టులు : అల్ల‌రి న‌రేష్, నిఖిలా విమ‌ల్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్, హైప‌ర్ ఆది త‌దిత‌రులు.. నిర్మాణం: జాహ్న‌వి ఫిల్మ్స్ క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: ప‌్ర‌జీత్ అల్ల‌రి న‌రేష్ ఈ సారి కాస్త రూట్ మార్చాడు. ప్ర‌తీసారి కామెడీనే న‌మ్ముకునే న‌రేష్.. ఈ సారి క‌థ‌ను న‌మ్ముకున్నాడు. కానీ అది బాగా పాత‌ది. న‌టుడిగా తాను ఓకే గానీ ఈ క‌థ‌కు నాట్ ఓకే అనిపించింది. న‌రేష్ కు హిట్ రావాలంటే ఇంత‌కంటే మంచి క‌థే రావాలేమో. ఇక హీరోయిన్ నిఖిలా విమ‌ల్ పాత్ర పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఉన్నంత‌లో బాగా చేసాడు. హైప‌ర్ ఆది ఓవ‌ర్ యాక్ష‌న్ చేసిన‌ట్లు అనిపించింది. జ‌బ‌ర్ద‌స్థ్ కు సినిమాకు పెద్ద‌గా తేడా ఏం క‌నిపించ‌లేదు. హీరో నాన్న‌గా జ‌య‌ప్ర‌కాశ్ బాగా చేసాడు.

టెక్నిక‌ల్ టీం : షాన్ రెహ‌మాన్ సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. పాట‌లు బాగోలేవు. మ‌ళ‌యాల వ‌ర్ష‌న్ పాట‌ల్నే రిపీట్ చేసినా ఇక్క‌డ అవి ఆక‌ట్టుకోలేదు. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా ప్ర‌జీత్ తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌లేక‌పోయాడు. ఈ క‌థ మ‌ళ‌యాల ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయింది కానీ ఇక్క‌డ క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే. న‌రేష్ ను ఈ పాత్ర కోసం తీసుకోవ‌డ‌మే త‌ప్పు అనుకోవ‌చ్చేమో..?

చివ‌ర‌గా : అయ్యో పాపం న‌రేష్.. ఈ సారి కూడా....

రేటింగ్ 2/5

More Related Stories