English   

ఆ త్ర‌యం పోయే.. మ‌రో త్ర‌యం వ‌చ్చే..!

New-Generation-Trio-Creating-Sensations

శీనువైట్ల‌-కోన‌వెంక‌ట్-గోపీమోహ‌న్.. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈ త్ర‌యానికి ఉన్న డిమాండే వేరు. ఎన్నో అద్బుతాల‌ను సృష్టించారు వీళ్లు. ఈ త్ర‌యంలో సినిమా వ‌చ్చిందంటే అది హిట్టే. కానీ త‌ర్వాత కాలంలో అది మెల్ల‌గా మ‌స‌క‌బారింది. ఇప్పుడు ఈ త్ర‌యం పూర్తిగా అంత‌మైపోయింది. ఇప్పుడు మ‌రో కొత్త త్ర‌యానికి నాందీ ప‌డింది. ఇందులోనూ కోన‌వెంక‌ట్ ఉండ‌టం విశేషం. బాబీ-కోన‌వెంక‌ట్-చ‌క్ర‌వ‌ర్తి.. ఈ ముగ్గురు క‌లిసి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. తాజాగా జై ల‌వ‌కుశ కూడా ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చిందే. ఎన్టీఆర్ ను మూడు పాత్ర‌ల్లో చూపించాలంటే ఆ ద‌ర్శ‌కుడికి ఎంత ద‌మ్ము ఉండాలి..? ఆ దమ్ము బాబీకి ఇచ్చింది కోన‌వెంక‌ట్ అండ్ చ‌క్ర‌వ‌ర్తి. ఈ ఇద్ద‌రూ లేకుండా జై ల‌వ‌కుశ క‌థ వ‌చ్చుండేది కాదు. జై ల‌వ‌కుశ‌కు ఆది బాబీ అయితే.. ఆ ఆది అంతం వ‌ర‌కు రావ‌డానికి కార‌ణం మాత్రం కోన అండ్ చ‌క్రి. ఈ ముగ్గురు కలిసి భ‌విష్య‌త్తులో ఇంకెన్ని అద్బుతాలు సృష్టిస్తారో చూడాలిక‌..!

More Related Stories