English   

త్రివిక్ర‌మ్ ను ఆ ఒక్క‌టి కోరిన ఎన్టీఆర్.. 

ntr-trivikramm

మొన్న‌టి వ‌ర‌కు ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ సినిమా అంటే అభిమానులు బాగా ఎగ్జైట్ అయిపోయారు. దానికి కార‌ణం మాట‌ల మాంత్రికుడితో ఎన్నాళ్ల నుంచో ప‌ని చేయాల‌ని ఎన్టీఆర్ కోరుకోవ‌డ‌మే. కానీ ఇప్పుడు ఆనందం స్థానంలో టెన్ష‌న్ క‌నిపిస్తుంది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. త్రివిక్ర‌మ్ కు ఈ మ‌ధ్యే భారీ డిజాస్ట‌ర్ వ‌చ్చింది. అదే అజ్ఞాత‌వాసి. ఈ చిత్ర ఫ‌లితం చూసిన త‌ర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యంగ్ టైగ‌ర్ కూడా కాస్త కంగారులో ఉన్న‌ట్లు తెలుస్తుంది. ఈ విష‌యంపై నిర్మాత రాధాకృష్ణ త‌న హీరోను ప్ర‌త్యేకంగా క‌లిసిన‌ట్లు తెలుస్తుంది. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ విష‌య‌మై మాట్లాడుతూ.. త్రివిక్ర‌మ్ కు ఇంకాస్త టైమ్ కావాల‌ని అడిగిన‌ట్లు తెలుస్తుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి అనుకున్న షూటింగ్ కాస్తా.. ఇప్పుడు మార్చ్ కు వెళ్లిపోయేలా కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్ర‌మ్ కు ఓ కోరిక కోరుతున్నాడు. 

ఫ్లాప్ వ‌చ్చినా త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. నీపై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని త్రివ‌క్ర‌మ్ ఎన్టీఆర్ భరోసా ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అయితే మ్యూజిక్ డైరెక్ట‌ర్ విష‌యంలో మాత్రం మ‌న‌సు మార్చుకోవాల‌ని త్రివిక్ర‌మ్ ను ఎన్టీఆర్ కోరిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అజ్ఞాత‌వాసి సంగీతం విష‌యంలో చాలా విమ‌ర్శ‌లే వ‌చ్చాయి. అనిరుధ్ కు తెలుగు మ్యూజిక్ పెద్ద‌గా సెట్ కాలేద‌ని.. ఇక్క‌డ హీరోల ఇమేజ్ ఆయ‌న‌కు తెలియ‌ద‌ని బాగానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే ఫీల్ అవుతున్నాడు. అందుకే త‌న సినిమాకు అనిరుధ్ ను కాద‌ని.. దేవీని తీసుకోవాల‌ని కోరుతున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి దీనిపై ఈయ‌న ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు. ఆ మ‌ధ్య దేవి, త్రివిక్ర‌మ్ మ‌ధ్య గొడ‌వైంది. అందుకే క‌లిసి ప‌ని చేయ‌డం మానేసారు. మ‌రిప్పుడు ఎన్టీఆర్ కోసం త్రివిక్ర‌మ్, దేవి క‌లిసిపోతారేమో చూడాలిక‌..!
 

More Related Stories