English   

ఒక్క‌డు మిగిలాడు  రివ్యూ రేటింగ్

Okkadu-Migiladu-Movie-Review-Rating

మ‌నోజ్ సినిమాల‌పై సాధార‌ణంగా పెద్ద‌గా అంచ‌నాలేవీ ఉండ‌వు. కానీ ఒక్క‌డు మిగిలాడు మాత్రం కాస్త ఆస‌క్తి క‌లిగించింది. దానికి కార‌ణం మ‌నోజ్ ఎల్టీటీఈ గెట‌ప్ లో క‌నిపించ‌డ‌మే. అక్క‌డి క‌థ‌తో ద‌ర్శ‌కుడు అజ‌య్ సినిమా చేయ‌డ‌మే. మ‌రి ఈ చిత్రం అంచ‌నాలు అందుకుందా.. నిజంగానే ఆస‌క్తి పెంచేసిందా..?

క‌థ‌ : సూర్య (మంచు మనోజ్) శ్రీలంక నుంచి వచ్చిన శరణార్థుల్లో ఒకడు. ఇక్క‌డే ఓ యూనివర్శిటీలో పీజీ చేస్తుంటాడు. అందులో చ‌దువుకునే ముగ్గురు అమ్మాయిల‌ను మంత్రి కొడుకులు చంప‌స్తారు. దీనికి ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ హెల్ప్ చేస్తాడు. దీనిపై సూర్య న్యాయ పోరాటం మొద‌లుపెడ‌తాడు. దాంతో త‌ప్పుడు కేసులు పెట్టి పోలీసులు సూర్య‌ను అత‌డి గ్యాంగ్ ను అరెస్ట్ చేస్తారు. ఆ టైమ్ లో ఓ కానిస్టేబుల్ (పోసాని) సూర్య గ్యాంగ్ కు హెల్ప్ చేస్తాడు. ఆ స‌మ‌యంలో దేశ స్వాతంత్ర్యం కోసం.. వాళ్ల ఉనికి కోసం పోరాడిన పీట‌ర్(మంచు మ‌నోజ్) గురించి.. విక్ట‌ర్ (అజ‌య్ ఆండ్రూస్) గురించి చెప్తాడు సూర్య‌. తాను పసివాడిగా ఏ పరిస్థితుల్లో శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చాడో చెప్పడం మొదలుపెడతాడు. ఆ కథేంటి.. ఇక వర్తమానంలో అతడి పోరాటం ఎంతవరకు వచ్చింది.. అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం : దేశం కోసం చేసే పోరాటం.. శ‌ర‌ణార్థులు అంటూ పెద్ద పెద్ద లైన్లు.. దేశం ముందు ప్రాణం తృణ‌ప్రాయం అనే డైలాగులు.. ఇంత సీరియ‌స్ గా క‌థ ఉన్న‌పుడు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉండాలి. కానీ ఒక్క‌డు మిగిలాడులో మిస్ అయిందే అది. అస‌లు వాళ్లు ఎందుకు యుద్ధం చేస్తున్నారు.. శ‌ర‌ణార్థి ఎందుకు అయ్యాడు..? ఎందుకు శ్రీ‌లంక వ‌చ్చారు.. లేదంటే శ్రీ‌లంక‌లోనే ఉంటే వాళ్ల‌ను ఎందుకు అక్క‌డి వాళ్లు కూడా శ‌ర‌ణార్థులుగా చూస్తుంది.. అంత పెద్ద యుద్ధం జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం వాళ్లను ఎందుకు ప‌ట్టించుకోదు.. ఇలా ఒక్క‌డు మిగిలాడు సినిమా చూస్తున్న‌పుడు మ‌న మ‌న‌సులో మెదిలే అనుమానాలు. ఇందులో ఏ ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం దొర‌క‌దు. ఇక పీట‌ర్ గా నాయ‌కుడు మ‌నోజ్ కూడా ఎందుకు పోరాటం చేస్తాడ‌నే విష‌యంపై చిన్న క్లారిటీ కూడా ఉండ‌దు. ప్ర‌త్యేకంగా ఓ దేశం కావాలంటూ పోరాటం చేసే వాళ్లు క‌నీసం ప‌ట్టుమ‌ని పదిమంది కూడా ఉండ‌రు.

అస‌లు శ్రీలంక దేశంలో వాళ్లెందుకు శ‌ర‌ణార్థులు అయ్యారు.. ఇండియాతో పాటు అక్క‌డ కూడా వాళ్ల‌ను ఎందుకు శ‌ర‌ణార్థులుగా చూపిస్తున్నార‌నే విష‌యంపై ఓ క్లారిటీ కూడా ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు. ఎంత‌సేపూ వాళ్ల‌పై ఎవ‌రో గ‌న్స్ వేసుకుని ప‌డిపోవ‌డం.. వీళ్లు పారిపోవ‌డం.. అప్పుడ‌ప్పుడూ మ‌నోజ్ వ‌చ్చి వాళ్ల‌పై తిర‌గ‌బ‌డ‌టంతోనే ఫ‌స్టాఫ్ అయిపోతుంది. దేశం కోసం ప్రాణం అర్పిద్ధాం అంటాడు కానీ అస‌లు ఎందుకు పోరాడుతున్నారు.. వాళ్ల‌కి శ్రీ‌లంకన్స్ ఎలాంటి ద్రోహం చేసారో చూపించ‌లేదు. ఇక సెకండాఫ్ లో అయితే క‌థ న‌త్త‌న‌డ‌క‌న కాదు.. అంత‌కంటే నెమ్మ‌ది అనే ప‌దం ఉంటే అది వాడాలేమో. స‌ముద్రం మ‌ధ్య‌లో సినిమాలో వాళ్లు చేసే ప్ర‌యాణం కాదు.. అదే స‌ముద్రంలో మ‌నం కూర్చున్నామా అనే ఫీలింగ్ వ‌స్తుంది. సాగిపోయే క‌థ‌.. ఎంత‌కూ రానీ తీరం చూస్తుంటే జోల పాడ‌క‌పోయినా నిద్ర వ‌చ్చేస్తుంది. అంత ఎమోష‌నల్ సీన్స్ లో కూడా పెద్ద‌గా మ‌న‌సును హ‌త్తుకునే సన్నివేశాలు రాలేదు. ఓవ‌రాల్ గా క‌థ కూడా వాళ్ల బోట్ మాదిరే ఎటు వెళ్తుందో తెలియ‌ని రీతిలో వెళ్లిపోయింది. చివ‌రికి హీరోను వ‌చ్చి ఎవ‌రో చ‌చ్చే వ‌ర‌కు పొడుస్తారు అయినా ఒక్క‌డు మిగిలాడు అనే టైటిల్ కు న్యాయం చేస్తూ హీరోను బ‌తికించేస్తాడు ద‌ర్శ‌కుడు. 

న‌టీన‌టులు : మ‌ంచు మ‌నోజ్, అనీషా ఆంబ్రోస్, అజ‌య్ ఆండ్రూస్.. క‌థ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: అజయ్ ఆండ్రూస్ మ‌నోజ్ సీరియ‌స్ పాత్ర‌లో న‌టించాడు. రెండు పాత్ర‌ల్లోనూ ప‌ర్లేద‌నిపించాడు. కానీ ప్ర‌భాక‌ర‌న్ గెట‌ప్ లో మాత్రం మ‌నోజ్ కాస్త లావుగా క‌నిపించాడు.. పైగా అక్క‌డ‌క్క‌డా అంత అవ‌స‌రం లేదేమో అనిపించింది. అజ‌య్ ఆండ్రూస్ పాత్ర సినిమాకు కీల‌కం. త‌న క‌థే కావ‌డంతో పాత్ర కూడా తానే చేసాడు ద‌ర్శ‌కుడు అజ‌య్. విక్ట‌ర్ పాత్ర‌లో బాగానే న‌టించాడు. అస‌లు హీరో పాత్ర కంటే దీనిపైనే ఫోక‌స్ ఎక్కువ‌గా ఉంటుంది ముందు దీనికి మ‌నోజ్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ జ‌ర్న‌లిస్ట్ గా కొంత‌మేర క‌నిపించిందంతే. సుహాసినీ, మిలింద్ సోమ‌న్, ముర‌ళీ మోహ‌న్, పోసాని ఇలా వీళ్లంతా అతిథిపాత్ర‌లు మాత్ర‌మే.

టెక్నిక‌ల్ టీం : ఒక్క‌డు మిగిలాడులో కేవ‌లం రెండు పాట‌లు మాత్ర‌మే ఉన్నాయి. ఈ చిత్రానికి శివ ఆర్ నందిగాం అందించిన సంగీతం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. ముఖ్యంగా ఆర్ఆర్ ఆస‌క్తిక‌రంగా అనిపించ‌లేదు. చాలా సీన్స్ లో ఆర్ఆర్ స‌రిగ్గా పండ‌లేదు. ఇక సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఎడిటింగ్ బాగా వీక్. కొత్త ద‌ర్శ‌కుడు అజ‌య్ ఆండ్రూస్ రాసుకున్న క‌థ బ‌లంగా ఉంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యాడు. చ‌త్ర‌ప‌తి, బిల్లా 2 లాంటి సినిమాల్లో శ్రీ‌లంక‌న్ శ‌ర‌ణార్థుల గురించి చూపించిన‌పుడు ఆ ఎమోష‌న‌ల్ సీన్స్ క్యారీ అయ్యాయి. కానీ ఇందులో అది క‌నిపించ‌దు. అస‌లు యుద్ధం ఎందుకు చేస్తున్నారో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్ క‌నిపిస్తుంది. 

చివ‌ర‌గా : గాలి వాన‌లో.. అల‌ల తాకిడిలో.. తీరం తెలియ‌ని ప్ర‌యాణం..

రేటింగ్ 2/5

More Related Stories